Saturday, April 27, 2024
- Advertisement -

థర్డ్​వేవ్​తో పిల్లలకు ప్రమాదం లేదు..! మరో అధ్యయనం

- Advertisement -

గత కొంతకాలంగా కరోనా థర్డ్​వేవ్​ అంశం ఆందోళన కలిగిస్తున్నది. థర్డ్​వేవ్​లో పిల్లలకు ఎక్కువగా ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో భయం మరింత పెరుగుతున్నది. అయితే ఎయిమ్స్​ చేసిన ఓ సర్వే మాత్రం.. థర్డ్​వేవ్​తో పిల్లలకు ప్రమాదం ఉండకపోవచ్చని అంటున్నది. ప్రస్తుతం మనదేశంలో పిల్లల్లో సీరోపాజిటివిటీ అధికంగా ఉందని.. అంటే పెద్దల మాదిరిగానే పిల్లల్లోనూ సీరోపాజిటివిటీ రేటు ఉందని అందువల్ల పిల్లలకు పెద్దగా ప్రమాదం లేదని ఎయిమ్స్​ అంటోంది.

ఇటీవల ఎయిమ్స్​ సీరోపాజిటివిటీ పై దేశ వ్యాప్తంగా ఓ సర్వే నిర్వహించింది. మొత్తం ఐదు రాష్ట్రాల్లో 10 వేల మందిపై సర్వే నిర్వహించారు. 4 వేల 509 మందికి సంబంధించిన ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. వీరిలో 7వందల మంది 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు కాగా.. 3వేల 809 మంది 18 ఏళ్ల పైబడినవారు. వీరిలో సగటు వయసు ఢిల్లీ అర్బన్‌లో 11 ఏళ్లు, ఢిల్లీ రూరల్‌లో 12 ఏళ్లు, భువనేశ్వర్‌లో 11 ఏళ్లు, గోరఖ్‌పూర్‌లో 13 ఏళ్లు, అగర్తలాలో 14 ఏళ్లుగా ఉంది. మార్చి 15, జూన్‌ 10 మధ్య నమూనాలు సేకరించారు.

Also Read: వ్యాక్సిన్​తో లైంగికసామర్థ్యం తగ్గదు..! తేల్చిచెప్పిన అధ్యయనం..!

అయితే పిల్లల్లో సార్స్​ కోవ్​ 2 సీరో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉందని.. పెద్దల్లో లాగానే పిల్లల్లోనూ ఉందని ఈ అధ్యయనం తేల్చింది. దీంతో పిల్లలకు థర్డ్​వేవ్​లో కరోనా ప్రభావం చూపే అవకాశం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ లో వృద్ధులపై, సెకండ్ వేవ్ లో యువత, మధ్య వయస్కులపై కరోనా తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది. ఇక వచ్చే థర్డ్ వేవ్ లో పిల్లలపై కరోనా ప్రభావం చూపిస్తుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజా అధ్యయనం ద్వారా అవన్నీ నిజం కాదని తేలింది.

Also Read: ఏ సినిమా విడుదల ఎప్పుడు? అంతా గందరగోళమే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -