Friday, April 26, 2024
- Advertisement -

కేజీఎఫ్​- 2 రాక ఇప్పట్లో కష్టమే.. !

- Advertisement -

కేజీఎఫ్​ మూవీ దేశ వ్యాప్తంగా ఎంత సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అందుకే కేజీఎఫ్ చాప్టర్​- 2 ఎప్పుడెప్పుడు వస్తుందా..అని సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్​ దక్షిణాది చిత్ర పరిశ్రమతో పాటు బాలీవుడ్లో కూడా సంచలన విజయం సాధించింది. కన్నడ చిత్రమైన కేజీఎఫ్​ను ప్రశాంత్​ నీల్​ తెరకెక్కించగా.. యశ్​ హీరోగా నటించారు.

అప్పటి వరకు హీరో యశ్ అంటే కన్నడ సినీ ఇండస్ట్రీ వాళ్లకు మాత్రమే తెలుసు. కేజీఎఫ్​ దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లోకి డబ్​ అయి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టు పోవడంతో అతడి పేరు ఇండియా లెవెల్ లో మార్మోగుతోంది. ఇక బాలీవుడ్​, కోలీవుడ్​, టాలీవుడ్​ అనే తేడా లేకుండా అన్ని భాషల స్టార్​ హీరోలు ప్రశాంత్​ నీల్​తో సినిమా చేయాలని భావిస్తున్నారంటే ఆ మూవీకి ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే విడుదలైన కేజీఎఫ్​ -2 టీజర్​ దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో సంచలనం సృష్టించింది. వ్యూస్​, లైక్స్​లో టాప్​లో ఉంది.

Also Read: సీక్వెల్.. ఇప్పుడిదే సక్సెస్​ ఫార్ములా?

కేజీఎఫ్​- 2 సినిమాను జూలై 16న విడుదల చేయాలని నిర్మాతలు ముందుగా భావించారు. కానీ ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేలా లేదు. ఎందుకంటే ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా విడుదల చేయాలనుకున్నారు. అయితే అన్ని రాష్ట్రాల్లో కరోనా ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా తగ్గి.. 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్​ చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఈ మూవీని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. మరోవైపు దర్శకుడు ప్రశాంత్​ నీల్​.. ప్రభాస్​తో సలార్​ అనే ఓ మూవీని తీస్తున్నాడు.

Also Read: బీ టౌన్ పై తెలుగు అగ్ర హీరోల కన్ను..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -