Thursday, May 16, 2024
- Advertisement -

అటుకులతో లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

- Advertisement -

ఎంతో రుచికరమైన అటుకులు లడ్డూలను ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం ఇక్కడ తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు:
అటుకులు రెండు కప్పులు, చక్కెర ఒక కప్పు, నెయ్యి ఒకటిన్నర కప్పు, జీడిపప్పు, ఎండుద్రాక్ష గుప్పెడు, ఏలకులపొడి రెండు టేబుల్ స్పూన్లు.

తయారీ విధానం:
*ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులోకి అటుకులు వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అటుకులు చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని బాగా గ్రైండ్ చేయాలి.

*అదే గిన్నెలో కి పంచదార యాలకులు వేసి బాగా మిక్స్ చేయాలి.

Also read:ప్యాకెట్ పాలు తాగుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి!

*తరువాత స్టవ్ మీద ఒక కడాయిలో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు, ఎండుద్రాక్షలను దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.

*ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల పొడి పంచదార ఏలకుల పొడి వేసి కొద్దిగా నెయ్యిని వేస్తూ బాగా మిశ్రమంలా తయారు చేసుకోవాలి.

Also read:ఈ ఉప్పు తింటే బీపీ పేషెంట్స్ కు మంచిది..?

*ఈ మిశ్రమంలో ఎక్కడ ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా నీటిని కలుపుతూ, అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు , ఎండు ద్రాక్షను వేసి చిన్నచిన్న లడ్డులుగా తయారు చేసుకుంటే ఎంతో రుచికరమైన అటుకుల లడ్డూలు తయారైనట్లే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -