Thursday, April 25, 2024
- Advertisement -

రాకీభాయ్​తో మిల్కీబ్యూటీ రొమాన్స్​.. !

- Advertisement -

హ్యాపీడేస్​తో తెలుగు ఆడియన్స్​కు దగ్గరైంది మిల్కీ బ్యూటీ తమన్నా.. అంతకుముందే మనోజ్ శ్రీ అనే ఓ సినిమాలో నటించినా పెద్దగా పేరుతీసుకురాలేదు. హ్యాపీడేస్ తర్వాత మిల్కీ బ్యూటీకి తెలుగు, తమిళంలో అటు హిందీలో వరస అవకాశాలు వచ్చాయి. కానీ ఈ మధ్య తమన్నా కొంచెం డల్​ అయ్యింది. ప్రస్తుతం ఆమె గోపిచంద్​తో చేస్తున్న సీటీమార్​ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ఆహాలో ఓ వెబ్​సీరిస్​లో కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే తమన్నాకు ఇప్పుడు ఓ బంపర్​ ఆఫర్​ దక్కినట్టు టాక్​ వినిపిస్తుంది. కేజీఎఫ్ హీరో యశ్​.. తాజాగా ఓ పాన్​ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్​గా ఎంపికైనట్టు టాక్​. కేజీఎఫ్​ 1 లో తమన్నా ఓ స్పెషల్​ సాంగ్ లో అలరించింది. ఇప్పుడు ఏకంగా యశ్​ సినిమాలో హీరోయిన్​గా చాన్స్ కొట్టేసినట్టు టాక్​. ఇప్పటికే వరస అవకాశాలు లేక వెనకబడ్డ తమన్నాకు.. ఈ సినిమా హిట్​ కొడితే మళ్లీ వరస అవకాశాలు రావడం ఖాయడం అని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Also Read: కేజీఎఫ్​- 2 రాక ఇప్పట్లో కష్టమే.. !

కేజీఎఫ్​తో యశ్​ రేంజ్​ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన నటించిన కేజీఎఫ్-2 విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ క్రమంలో మరోమూవీకి యశ్ ఓకే చెప్పాడు. ముఫ్తీ ఫేమ్ నార్తన్ డైరెక్షన్ లో ఆయన మరో సినిమా చేయబోతున్నాడు. ఇందులో యశ్.. నెవీ అధికారిగా కనిపించబోతున్నట్టు టాక్​. హోంబలే ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఈ మూవీలోనూ యశ్​ మాస్​ లుక్స్​లో అదరగొట్టనున్నాడు. ఇక తమన్నాకు ఎటువంటి క్యారెక్టర్​ ఇస్తారో వేచి చూడాలి.

Also Read: మురుగదాస్ – కమల్ కాంబినేషన్ లో సినిమా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -