అమేజాన్ ప్రైమ్‌లో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరిస్ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్క హిందీ అనే కాదు అన్ని భాషల్లోనూ ఈ సీరిస్ మంచి పేరు తెచ్చుకుంది. ఫ్యామిలీ మ్యాన్1 తో పోల్చి చూస్తే .. ఫ్యామిలీ మ్యాన్ -2 భారీ సక్సెస్ అయ్యింది. మొదటి భాగానికి రెండో భాగానికి మధ్య రెండేళ్ల గ్యాప్ వచ్చిన ప్రేక్షకులు ఆ సీరిస్ కోసం ఎదురు చూసారు.
ఫ్యామిలీ మ్యాన్ -2 ట్రైలర్ కి యూట్యూబ్ లో 50 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయంటే ఆ వెబ్ సీరిస్ కోసం జనం ఎంత ఎదురు చూసారో అర్థమవుతుంది. ఫస్ట్ సీరిస్ హిట్ కావడం, రెండో సీజన్ లో హీరోయిన్ సమంత కీలక పాత్రలో నటించడం.. అది కూడా నెగిటివ్ రోల్ చేయడంతో ఈ సీరిస్ భారీ సక్సెస్ అయ్యింది. ఇక సమంత కు సైతం మంచి పేరు తీసుకొచ్చింది.
ఇక ఫ్యామిలీ మ్యాన్ -3 కి సంబంధించి ఇప్పటికే పలు పుకార్లు వినిపిస్తున్నాయి. మూడో సీజన్ లో కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది? అనే కథాంశం ఉండనున్నట్టు టాక్. ఇందుకు సంబంధించి ఇప్పటికే గత సీరిస్ లో ఓ హింట్ కూడా ఇచ్చారట. అయితే మూడో సీరిస్‌లో తమిళ క్రేజీ హీరో విజయ్ సేతుపతి ఓ ప్రధాన పాత్ర పోషించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి అధికారిక సమాచారం ఏదీ రాలేదు. కానీ ఈ మేరకు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ విషయంపై సేతుపతిగానీ, ‘ఫ్యామిలీ మ్యాన్’ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే కానీ అధికారికంగా ప్రకటించలేదు.
Also Read