సాయిపల్లవి నటించిన సారంగధరియా పాట విడుదలైన నాటినుంచే రికార్డులు మోత మోగిస్తోంది. ఆరంభంలో కాస్త వివాదాలు వచ్చినా.. ఆ తర్వాత ఈ పాట దూసుకుపోయింది. ఇప్పుడు ఏకంగా 250 మిలియన్ వ్యూస్ అంటే 25 కోట్ల వ్యూస్ సాధించింది. గతంలో రౌడీ బేబీ పేరిట సాయిపల్లవికి వ్యూస్ పరంగా గొప్ప రికార్డు కూడా ఉంది. అలాగే ఫిదాలో ‘వచ్చిందే మెల్లమెల్లగా వచ్చిందే’ పాట కూడా సంచలనం సృష్టించింది.
ఇక సారంగధరియా పాటను లవ్‌స్టోరీ సినిమా కోసం శేఖర్ కమ్ముల చిత్రీకరించారు. సుద్దాల రాసిన జానపద బాణి అన్ని వర్గల ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ మూవీలో నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు. ముఖ్యంగా సారంగధరియా పాటకు సాయిపల్లవి అలవోకగా వేసిన స్టెప్పులు ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక మంగ్లీ గొంతు కూడా కలిసొచ్చింది.
ఇటీవల టాలీవుడ్ దర్శకులంతా జానపద బాణీల మీద పడ్డారు. ఫిబ్రవరి 28న రిలీజైన ఈ పాట మొదటినుంచి రికార్డుల మోత మోగించింది. విడుదలైన 14 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్ సాధించింది. 32 రోజుల్లో 100 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ పాట ఇప్పుడు 250 మిలియన్ల వ్యూస్ సాధించింది. కరోనా సెకండ్ వేవ్ రాకపోతే .. లవ్‌స్టోరీ చిత్రం ఈ పాటికి విడుదలయ్యేదే. కానీ కరోనా తో ఆగిపోయింది. త్వరలో విడుదలయ్యే చాన్స్ ఉందన్న వార్తలు వస్తున్నాయి.
Also Read