ప్రస్తుతం మా ఎన్నికల హడావుడి నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ప్రముఖ నటుడు నాగబాబు.. మా అధ్యక్షుడు నరేశ్ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇక ఈ సారి మెగా కుటుంబం మద్దతుతో ప్రకాశ్‌రాజ్ బరిలో నిలవగా.. కొందరు సీనియర్ నటుల సపోర్ట్‌తో మంచు విష్ణు పోటీలో ఉన్నారు. జీవిత రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావు కూడా బరిలో ఉంటారన్న వార్తలు వినిపిస్తున్నాఇంకా క్లారిటీ లేదు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ వేడి అప్పుడే మొదలైంది.
సెలబ్రిటీలు పైగా సినిమా నటుల ఎన్నిక కాబట్టి మీడియా దృష్టి మొత్తం అటువైపే ఉంది. మాది ఓ చిన్న సంఘం కేవలం 900 సభ్యులున్న సంఘం ఎందుకు మీడియా ఇంత ఎందుకు హడావుడి చేస్తుంది అంటూ మా సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగు సినీ పరిశ్రమపై తాజాగా ప్రముఖ నిర్మాత, నటుడు, మాజీ ఎంపీ మురళి మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
’ గతంలో సినీ పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా దాసరి నారాయణరావు ముందుండి పరిష్కరించేవారు. ప్రస్తుతం ఆ బాధ్యతను చిరంజీవి తన మీద వేసుకున్నారు. నేనే ఓ రోజు చిరంజీవి గారితో ఈ విషయం ప్రస్తావించాను. గతంలో ఏ సమస్య వచ్చినా దాసరి నారాయణరావు చూసుకొనే వారు. ఆయన ఎంతో మందికి అన్నం పెట్టారు. ఆదుకున్నారు. అవకాశాలు ఇప్పించారు.’ అని మురళి మోహన్ పేర్కొన్నారు. ప్రస్తుత మా ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌కు ..చిరంజీవి మద్దతు ఇస్తున్నాడు. ఆయన ప్యానెల్‌ను చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఓ సామాజికవర్గం చిరంజీవికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో మురళి మోహన్ చిరంజీవికే మద్దతుగా మాట్లాడటం గమనార్హం.
Also Read