Thursday, April 25, 2024
- Advertisement -

ఇంగ్లీష్​లో డబ్​ అయిన తొలి తెలుగు సినిమా ఏంటో తెలుసా?

- Advertisement -

సాధారణంగా హాలీవుడ్​ సినిమాలు తెలుగులో డబ్​ అవుతూ ఉంటాయి. కానీ తొలిసారిగా ఓ తెలుగు సినిమా ఇంగ్లీష్లోకి డబ్​ అయి అక్కడ కూడా ప్రశంసలు దక్కించుకున్నది. ఇటీవల కాలంలో బాహుబలి లాంటి సినిమాలు ఇంగ్లీష్​లోకి డబ్​ అయ్యాయి. అయితే 1990 వ సంవత్సరంలో ఓ తెలుగు సినిమా ఇంగ్లీష్​​లో డబ్​ అయ్యింది. అదే చిరంజీవి నటించిన కొదమసింహం..

తెలుగు నుంచి ఇంగ్లీష్​లోకి అనువదించబడ్డ తొలి చిత్రంగా ఈ సినిమా రికార్డులకెక్కింది. ఈ సినిమా చాలా విభిన్నంగా తెరకెక్కించారు. అంటే అప్పటికే తెలుగు సినిమా అంటే ఇలా ఉండాలి అనే ఓ లెక్క ఉండేది. ఆరుపాటలు, ఓ స్పెషల్ సాంగ్​, క్లైమాక్స్​లో భారీ ఫైట్​ చెల్లి, తల్లి సెంటిమెంట్​.. కానీ కొదమ సింహం కాస్త భిన్నంగా ఉంటుంది. ఇందులో హీరో చిరంజీవి ఓ కౌబాయ్​గా నటించాడు. ఇక సినిమా మేకింగ్​ అంతా ఎడారి ప్రాంతంలో కాస్త విభిన్నంగా ఉంటుంది.

మోహన్​బాబు కూడా ఓ విచిత్రమైన వేషధారణలో కామెడీ విలన్​గా నటించాడు. రమా ఫిల్మ్స్ బ్యానర్ పై కె.మురళీమోహనరావు దర్శకత్వంలో చిరంజీవి , సోనమ్ , రాధ, మోహన్ బాబు ప్రధాన పాత్రలో ఈ మూవీ తెరకెక్కింది. 1990 ఆగస్ట్ 9 న విడుదలై మంచి విజయం నమోదు చేసింది. ఇక ఇంగ్లీష్​లో డబ్​ అయి అక్కడ కూడా మంచి పేరే తెచ్చుకుంది.

Also Read

పాన్ ఇండియా వైపు దూసుకెళ్తున్నామా.. సొంత ఇలాకా అప్పగిస్తున్నామా?

థియేటర్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారు..? ఏ సినిమా విడుదల ఎప్పుడు..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -