Wednesday, May 8, 2024
- Advertisement -

చేపల పులుసు ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తినాల్సిందే?

- Advertisement -

మార్కెట్లో పులుసు చేప కనపడితే కొనకుండా ఎవ్వరూ ఉండలేము. ఈ విధంగా చేపల కొనుకొని పులుసు చేస్తే మాత్రం కంచం ఖాళీ చేయకుండా ఉండలేరు. మరి రుచికరమైన చేపల పులుసు ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు
చేప ముక్కలు కిలో, గుప్పెడు చింతపండు, ఉల్లిపాయ ముక్కలు అర కప్పు, వెల్లుల్లి రెబ్బలు పావు కప్పు, ధనియాల పొడి టేబుల్ స్పూన్, కారం టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర గుప్పెడు, కొబ్బరి పొడి రెండు టేబుల్ స్పూన్లు. నూనె తగినంత, నీళ్లు కావలసినన్ని.

తయారీ విధానం:
*ముందుగా చేపలను బాగా శుభ్రం చేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. అదేవిధంగా చింతపండును నీటిలో వేసి నానబెట్టుకోవాలి.

*తరువాత వెల్లుల్లి, ఉల్లిపాయలు, కొత్తిమిర, ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసి మసాలా తయారుచేసుకోవాలి.

*తరువాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడి అయిన తర్వాత కావాలనుకుంటే పోపు పెట్టుకోవచ్చు లేకపోతే లేదు.

*నూనె వేడి అయిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాను వేసి చిన్న మంటపై కలియబెడుతూ ఉడికించాలి.

Also read:రసవత్తరంగా మారిన “మా” ఎన్నికలు.. బరిలోకి ఓ. కళ్యాణ్?

*ఈ మసాలాలోకి ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలియబెట్టాలి. రెండు నిమిషాల తర్వాత అర లీటరు నీటిని వేసి బాగా ఉడికించాలి.

*ఈ విధంగా నీటిని వేసిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి పులుసు తీసి ఈ మిశ్రమంలోకి పోయాలి.

*ఈ విధంగా మసాలా మిశ్రమం బాగా ఉడుకుతున్న సమయంలో ముందుగా శుభ్రం చేసి పెట్టుకొన్న చేపముక్కలను అందులో వేయాలి.

Also read:అంత వంగకు అనసూయ… అనసూయ డ్రెస్ పై కామెంట్స్ చేసిన సుమ?

*చేపముక్కలను వేసిన తర్వాత మాటిమాటికీ చేపలను కలియ పెట్టకూడదు. ఇలా చేయటం వల్ల చేపు మొత్తం విడిపోతుంది.

*చిన్న మంటపై ఒక 10 నిమిషాల పాటు ఉడికించడం వల్ల ఎంతో రుచికరమైన చేపల పులుసు తయారైనట్లే. చేపల పులుసు వేడి వేడిగా తినడం కంటే అది చల్లబడే కొద్దీ ఎంతో రుచిగా ఉంటుంది. కనుక చల్లబడిన తర్వాత తినడం వల్ల అద్భుతమైన రుచిని ఆస్వాదించవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -