Tuesday, April 30, 2024
- Advertisement -

హిట్​ కోసం గోపిచంద్​ వెయిటింగ్​.. 30వ సినిమా అయినా వర్కవుట్​ అవుతుందా?

- Advertisement -

గోపీచంద్ కు గత కొంతకాలంగా సరైన హిట్​ పడటం లేదు. విలన్​ క్యారెక్టర్లతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్.. అనతి కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. యజ్ఞం, లక్ష్యం, లౌక్యం, ఆంధ్రుడు వంటి చిత్రాలు గోపీచంద్ కు మంచి పేరు తీసుకొచ్చాయి. కానీ ఇటీవల గోపీ చంద్ కు సరైన హిట్​ పడటం లేదు. చాణక్య, గౌతమ్​నంద, ఆక్సిజన్​, జిల్ వంటి చిత్రాలు ఆకట్టుకోలేకపోయాయి.

ప్రస్తుతం గోపీచంద్ నటించిన సీటిమార్​ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీపైనే గోపీచంద్​ ఆశలు పెట్టుకున్నాడు. మరోవైపు నాలుగేళ్ల క్రితం ఆర్థిక సమస్యలతో ఆగిపోయిన ఆరడుగుల బుల్లెట్​ చిత్రం త్వరలో విడుదల కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే గోపీ చంద్.. శ్రీవాస్​ కాంబినేషన్​లో తన 30 వ చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్​ తాజాగా విడుదలైంది.

కోల్​కతా బ్యాక్​డ్రాప్​లో ఈ మూవీ తెరకెక్కబోతున్నదట. ఓ విభిన్నమైన కథాంశంతో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్టు టాక్​. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులు వచ్చాయి. ఆరుపాటలు, క్లైమాక్స్​లో భారీ ఫైట్​, ఇంటర్వెల్​ బ్యాంగ్​, చివర్లో ట్విస్ట్​ వంటి రొటీన్​ ఫార్ములాను ప్రేక్షకులు ఇష్టపడం లేదు. కేవలం విభిన్న కథా చిత్రాలు మాత్రమే ఆడుతున్నాయి. ఈ క్రమంలో దర్శకులు, నిర్మాతలు కూడా అటువంటి సినిమాల వైపే మొగ్గు చూపుతున్నారు. అలా ఓ విభిన్న కథ గోపిచంద్ ముందుకు రావడంతో.. తనకు గతంలో రెండు సక్సెస్​లు అందించిన శ్రీవాస్​తో 30వ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడట గోపీ చంద్​. ఈ సినిమా అయినా సక్సెస్​ అవుతుందేమో వేచి చూడాలి.

Also Read

రాధేశ్యామ్​ మరింత ఆలస్యం.. నిరాశలో ఫ్యాన్స్​..!

ఈ వారం ఓటీటీ చిత్రాలు ఇవే..!

రాధేశ్యామ్​ రికార్డు.. ఏ ఇండియన్​ సినిమాకు దక్కని ఘనత

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -