Thursday, April 25, 2024
- Advertisement -

ఈ వారం ఓటీటీ చిత్రాలు ఇవే..!

- Advertisement -

కరోనా దెబ్బకు థియేటర్ల పని అయిపోయింది. ప్రేక్షకులంతా ఓటీటీలవైపు మొగ్గు చూపుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే తమ అభిమాన హీరో సినిమా థియేటర్లలో విడుదలవుతుందంటే ఎదురు చూసే ప్రేక్షకులు ఉన్నారు. కానీ థియేటర్ యజమానులు కరోనాను దృష్టిలో ఉంచుకొని ఇంకా సినిమాలు విడుదలకు అంగీకరించడం లేదు. మరోవైపు చాలా సినిమాలు విడుదలకు నోచుకోకుండా ఆగిపోయాయి. దీంతో ఓటీటీలో కూడా మంచి ధర పలుకుతుండటంతో చాలా మంది నిర్మాతలు చిత్రాలను ఓటీటీలకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఓటీటీలకు విపరీతమైన డిమాండ్​ వచ్చింది.

ప్రతి శుక్రవారం ఏయే సినిమాలు విడుదలవుతున్నాయా? అంటూ ఓటీటీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ వారం ఏయే సినిమాలు విడుదలవుతున్నాయో? ఓ సారి చూద్దాం.. ‘కుడి ఎడమైతే’ చిత్రం ఈ నెల 16న ఆహాలో స్ట్రీమింగ్ కానున్నది. క్రైం, సస్పెన్స్​ థ్రిల్లర్​గా ఈ మూవీ తెరకెక్కింది. అమలా పాల్​ పోలీస్​ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్​ ప్రేక్షకులను ఆకట్టుకున్నది. ఈ చిత్రానికి పవన్​ కుమార్​ దర్శకత్వం వహించాడు.

మలయాళ నటుడు పహాద్‌ ఫాజిల్‌ ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అతడు నటించిన ‘మాలిక్‌’ చిత్రం ఈ నెల 15న అమేజాన్​లో స్ట్రీమింగ్​ కానున్నది. ఈ చిత్రాన్ని రూ. 30 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కించారు. బాలీవుడ్‌ చిత్రం ‘తుఫాన్‌’ అమెజాన్‌ లో స్ట్రీమింగ్​ కానున్నది. స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో ఫరాన్‌ అక్తర్‌ హీరోగా నటించాడు. రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ దర్శకత్వం వహించాడు. ఈనెల 16న అమేజాన్​లో ఈ మూవి విడుదల కాబోతున్నది. వీటితోపాటు మరికొన్ని సినిమాలు కూడా ఓటీటీలో విడుదల కాబోతున్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌

గన్‌పౌడర్‌ మిల్క్‌షేక్‌ (జులై 14)
నెవర్‌ హ్యావ్‌ ఐ ఎవర్‌ ఎస్‌2 (జులై 15)
ఫియర్‌ స్ర్టీట్‌ 3(జులై 16)
డీప్‌ (జులై 16)
ఎ పర్ఫెక్ట్‌ ఫిట్‌(జులై 16)
జానీ టెస్ట్‌ (జులై 16)
కాస్మిక్‌ సిన్‌ (జులై 17)
మిల్క్‌ వాటర్‌ (జులై 20)

డిస్నీ+ హాట్‌స్టార్‌

ది వైట్‌ లోటస్‌ (జులై 13)
క్యాచ్‌ అండ్‌ కిల్‌-ది పాడ్‌ క్యాస్ట్‌ టేప్స్‌ (జులై 13)

Also Read

రాధేశ్యామ్​ రికార్డు.. ఏ ఇండియన్​ సినిమాకు దక్కని ఘనత

నారప్ప, విరాటపర్వం నేరుగా ఓటీటీలోకి .. డీల్​ ఎంతంటే?

దాదా బయోపిక్​కు లైన్​ క్లియర్​.. హీరో ఎవరంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -