రాధేశ్యామ్​ రికార్డు.. ఏ ఇండియన్​ సినిమాకు దక్కని ఘనత

- Advertisement -

బాహుబలి విడుదల తర్వాత ప్రభాస్​ రేంజ్​ ఎక్కడికో వెళ్లిపోయింది. కేవలం పాన్​ ఇండియా లెవల్​లో భారీ బడ్జెట్ సినిమాల్లో మాత్రమే నటిస్తున్నాడు ప్రభాస్​. అందులో భాగంగానే.. యూవీ క్రియేషన్స్​ బ్యానర్​పై రాధేశ్యామ్​ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నాడు. పిరియాడికల్​ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్​ విక్రమాధిత్యగా కనిపిస్తున్నాడు. ఇక ప్రేరణ అనే యువతి పాత్రను పూజా హెగ్డే చేస్తోంది.

హాలీవుడ్​ రేంజ్ లో ఓ గొప్ప ప్రేమకథగా ఈ చిత్రం నిలిచిపోతుందట. ఇక ఈ మూవీ కోసం ఫ్యాన్స్​, సినీ జనాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే రాధేశ్యామ్​ మోషన్​ పోస్టర్​ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నది. ఈ మోషన్​ పోస్టర్​కు ఇప్పటివరకు 21 మిలియన్​ వ్యూస్​ వచ్చాయి. ఇంతవరకు ఏ భారతీయ సినిమా ఈ స్థాయి వ్యూస్​ సాధించలేదు. ఇండియన్ సినిమా విషయంలో ఇదో రికార్డు అని చెబుతోంది చిత్ర యూనిట్​.

- Advertisement -

ఈ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది. పోస్ట్​ ప్రొడక్షన్​ పనులు ఎప్పటికి కంప్లీట్​ అవుతాయి? సినిమా ఎప్పుడు విడుదలవుతుంది? అనే విషయంపై మాత్రం ఇంతవరకు క్లారిటీ లేదు. ఇక ప్రభాస్​ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్​తో ఆదిపురుష్​లో, కేజీఎఫ్​ ఫేమ్​ ప్రశాంత్​ నీల్​ తో సలార్​లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత నాగ్ అశ్విన్​తో మరో ప్రతిష్ఠాత్మక చిత్రంలో నటించబోతున్నాడు ప్రభాస్​.

Also Read

తమన్ కి తమనే పోటీ..!

సోషల్ మీడియా సినీ ఇండస్ట్రీకి ప్లస్సా.. మైనస్సా..!

ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే ‘సౌత్ ఇండస్ట్రీయే’..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -