పవన్ రికార్డుని పటాపంచలు చేసిన అల్లు అర్జున్

DJ Duvvada Jagannadham Teaser Crosses Katamarayudu Teaser Views

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తాజా మూవీ ‘కాటమరాయుడు’ టీజర్యూట్యూబ్‌లో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. విడుదలైన గంటలోనే 1 మిలియన్‌కిపైగా వ్యూస్ సాధించగా.. ఆ సంఖ్య 10 మిలియన్ల వ్యూస్ వరకు వెళ్లింది. దాంతో.. అన్ని వ్యూస్ సాధించిన తొలి తెలుగు టీజర్‌గా అది చరిత్రపుటలకెక్కింది. అంతేకాకుండా.. 11 మిలియన్ల మైలురాయిని కూడా క్రాస్ చేసి, తెలుగులో అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న టీజర్‌గా ఘనత సాధించింది.

అయితే.. తాజాగా ఆ రికార్డ్‌ని స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ‘డీజే’ మూవీ టీజర్ తక్కువ టైంలోనే బద్దలుకొట్టేసింది. ఫిబ్రవరి 4వ విడుదలైన ‘కాటమరాయుడు’ టీజర్ 1 కోటి 14 లక్షల 19 వేలకుపైగా వ్యూస్ సొంతం చేసుకోగా.. ఫిబ్రవరి 24వ తేదీన రిలీజ్ అయిన ‘డీజే’ టీజర్ 1 కోటి 14 లక్షల 99 వేల వ్యూస్ రాబట్టుకుంది. నిజానికి.. రాయుడి రికార్డ్‌ని డీజే బీట్ చేయడం కష్టమేనని అంతా అనుకుంటే, దానికంటే వేగంగా 1 కోటి వ్యూస్‌ని అందుకు సంచలనం రేపింది. ఇప్పుడైతే ఏకంగా ‘రాయుడి’ టోటల్ వ్యూస్‌ని దాటేసి.. తెలుగులో అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న టీజర్‌గా ‘డీజే’ ఆల్‌టైం రికార్డ్ సొంతం చేసుకుంది.

అయితే లైక్స్ పరంగా మాత్రం రాయుడిని బీట్ చేయలేకపోయింది. రాయుడు టీజర్‌కి 2.64 లక్షలకుపైగా లైక్స్ వుండగా.. ‘డీజే’కి 1.9 లక్షలకుపైగా వున్నాయంతే. ఇక డిస్‌లైక్స్ విషయంలో చెత్త రికార్డ్‌ని సొంతం చేసుకుంది డీజే. ఇప్పటివరకైతే ఈ టీజర్‌కి 1.68 లక్షలకుపైగా డిస్‌లైక్స్ వున్నాయి. మొత్తానికి ఈ టీజర్ యూట్యూబ్‌లో రికార్డుల సృష్టిస్తోంది.

{youtube}YA48dqwrunE{/youtube}

{youtube}0jz0C4LYpdE{/youtube}

Related

  1. కాటమరాయుడు ఫెయిల్యూర్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు
  2. పవన్ ఫ్యాన్స్ పై మహేష్ ఫ్యాన్స్ రివెంజ్ తీర్చుకున్నారు..?
  3. పవన్ ఆత్మహత్యకు ప్రయత్నించిన సంగతి తెలుసా..?
  4. పవన్ బరిలోకి దిగితే ఎవరికి లాభం..?