రెండ్రోజుల క్రితం ఆహా ఓటీటీలో విడుదలైన కుడిఎడమైతే వెబ్‌సీరిస్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్నది. ఇప్పటివరకైతే వెబ్సిరిస్ల నిర్మాణంలో అమెజాన్ టాప్‌లో ఉంది. అసలు ఆహా ఆ రేంజ్‌కు వెళ్లడం చాలా కష్టమని అంతా భావించారు. కానీ వారి ఆలోచనలు పటాపంచలు చేసేలా ఆహాలో విడుదలైన కుడిఎడమైతే ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. గతంలో ఆహాలో కేవలం తమిళ డబ్బింగ్ సినిమాలు, మలయాళ డబ్బింగ్ సినిమాలు ఎక్కువగా కనిపించేవి. ఆహా సొంతంగా కొన్ని వెబ్‌సీరిస్‌లు నిర్మించింది. కానీ అవి ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
మరోవైపు వెబ్‌సీరిస్‌లు అంటే మితిమీరిన శృంగారం, హింస అనే చాలా మంది ప్రేక్షకులు భావిస్తుంటారు. కానీ అటువంటి వాళ్లు కూడా ఆహాలో వచ్చిన ఈ వెబ్ సీరిస్ చూసి తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నారు. నెట్ ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్, హాట్ స్టార్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో వెబ్‌సీరిస్‌లో చాలా వచ్చాయి. కానీ తెలుగు సంస్థ అయిన ఆహాలో ఇంతవరకు మంచి వెబ్‌సీరిస్ రాలేదు. దీంతో హిందీ వెబ్‌సీరిస్‌లు బాగుంటాయన్న వాదన మొదలైంది.
Also Read: అల్లూ ఫ్యాన్స్.. వెయిటింగ్ అక్కర్లేదు.. పుష్పరాజ్ వచ్చేది ఈ ఏడాదే..!
మనవాళ్లు ఆ స్థాయిలో తీయలేరని.. ఆ స్థాయి ప్రమాణాలు పాటించలేరని విమర్శలు వచ్చాయి.దీంతో ఆహా చాలెంజింగ్‌గా తీసుకొని బ్రహ్మాండమైన వెబ్‌సీరిస్‌ను ప్లాన్ చేసింది. గతంలో లూసియా, యూటర్న్ వంటి చిత్రాలు తీసిన పవన్‌కుమార్ ఈ సారి ఆహా కోసం అద్భుతమైన వెబ్ సీరిస్ ప్లాన్ చేశాడు.అమలా పాల్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. టైమ్ ల్యాప్ అనే కాన్సెప్ట్‌తో ఒక వ్యక్తి జీవితంలో ఒకేరోజు మళ్లీ మళ్లీ రిపీట్ అయితే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్‌తో ఈ సీరస్ తెరకెక్కింది.
నిజానికి ఈ సబ్జెక్ట్ తెలుగు ప్రేక్షకులకు చాలా కొత్త. గతంలో పూరి జగన్నాథ్ దేవుడు చేసిన మనుషులు సినిమా దీనికి దగ్గరగా ఉంటుంది. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతో బోర్ కొట్టించింది.కానీ కుడి ఎడమైతే మాత్రం .. ఉత్కంఠ భరితంగా సాగింది. అన్ని ఎపిసోడ్స్‌లోనూ ఒకే సీన్స్ ఉంటాయి. కానీ వైవిధ్యంగా ఉంటాయి. ఇటువంటి ఓ ప్రయోగాత్మకంగా చిత్రాన్ని ప్రేక్షకులకు నచ్చేలా తీయడం సాహసమే.
Also Read: ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ అరుపులేనా..!