‘కుడిఎడమైతే’ వెబ్​సీరిస్​తో .. ​ అమాంతం పెరిగిన ఆహా ఇమేజ్..!

- Advertisement -

రెండ్రోజుల క్రితం ఆహా ఓటీటీలో విడుదలైన కుడిఎడమైతే వెబ్​సీరిస్​ పాజిటివ్​ టాక్​తో దూసుకుపోతున్నది. ఇప్పటివరకైతే వెబ్​సిరిస్​ల నిర్మాణంలో అమెజాన్​ టాప్​లో ఉంది. అసలు ఆహా ఆ రేంజ్​కు వెళ్లడం చాలా కష్టమని అంతా భావించారు. కానీ వారి ఆలోచనలు పటాపంచలు చేసేలా ఆహాలో విడుదలైన కుడిఎడమైతే ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. గతంలో ఆహాలో కేవలం తమిళ డబ్బింగ్​ సినిమాలు, మలయాళ డబ్బింగ్​ సినిమాలు ఎక్కువగా కనిపించేవి. ఆహా సొంతంగా కొన్ని వెబ్​సీరిస్​లు నిర్మించింది. కానీ అవి ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

మరోవైపు వెబ్​సీరిస్​లు అంటే మితిమీరిన శృంగారం, హింస అనే చాలా మంది ప్రేక్షకులు భావిస్తుంటారు. కానీ అటువంటి వాళ్లు కూడా ఆహాలో వచ్చిన ఈ వెబ్ సీరిస్​ చూసి తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నారు. నెట్ ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్, హాట్ స్టార్ ఓటీటీ ఫ్లాట్​ఫామ్స్​లో వెబ్​సీరిస్​లో చాలా వచ్చాయి. కానీ తెలుగు సంస్థ అయిన ఆహాలో ఇంతవరకు మంచి వెబ్​సీరిస్​ రాలేదు. దీంతో హిందీ వెబ్​సీరిస్​లు బాగుంటాయన్న వాదన మొదలైంది.

- Advertisement -

Also Read: అల్లూ ఫ్యాన్స్.. వెయిటింగ్ అక్కర్లేదు.. పుష్పరాజ్ వచ్చేది ఈ ఏడాదే..!

మనవాళ్లు ఆ స్థాయిలో తీయలేరని.. ఆ స్థాయి ప్రమాణాలు పాటించలేరని విమర్శలు వచ్చాయి.దీంతో ఆహా చాలెంజింగ్​గా తీసుకొని బ్రహ్మాండమైన వెబ్​సీరిస్​ను ప్లాన్​ చేసింది. గతంలో లూసియా, యూటర్న్​ వంటి చిత్రాలు తీసిన పవన్​కుమార్​ ఈ సారి ఆహా కోసం అద్భుతమైన వెబ్​ సీరిస్​ ప్లాన్​ చేశాడు.అమలా పాల్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. టైమ్​ ల్యాప్​ అనే కాన్సెప్ట్​తో ఒక వ్యక్తి జీవితంలో ఒకేరోజు మళ్లీ మళ్లీ రిపీట్​ అయితే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్​తో ఈ సీరస్​ తెరకెక్కింది.

నిజానికి ఈ సబ్జెక్ట్​ తెలుగు ప్రేక్షకులకు చాలా కొత్త. గతంలో పూరి జగన్నాథ్​ దేవుడు చేసిన మనుషులు సినిమా దీనికి దగ్గరగా ఉంటుంది. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతో బోర్​ కొట్టించింది.కానీ కుడి ఎడమైతే మాత్రం .. ఉత్కంఠ భరితంగా సాగింది. అన్ని ఎపిసోడ్స్​లోనూ ఒకే సీన్స్​ ఉంటాయి. కానీ వైవిధ్యంగా ఉంటాయి. ఇటువంటి ఓ ప్రయోగాత్మకంగా చిత్రాన్ని ప్రేక్షకులకు నచ్చేలా తీయడం సాహసమే.

Also Read: ఆర్​ఆర్​ఆర్​ మ్యూజిక్​ అరుపులేనా..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -