Thursday, May 9, 2024
- Advertisement -

కమల్ కు తెలుగులో ఇంత మార్కెట్​ ఉందా?

- Advertisement -

కమల్​ హాసన్​ విశ్వనటుడు. ఆయన చిత్రాలు ఏ భాష వారినైనా అలరిస్తాయి. ఇక కమల్ ఎంచుకొనే పాత్రలు, చేసే సబ్జెక్టులు కూడా అలాగే ఉంటాయి. దీంతో ఆయనకు తమిళంలో లాగే ఇతర భాషల్లోనే మార్కెట్​ ఎక్కువగా ఉంది. తెలుగులో కూడా కమల్​హాసన్​ మార్కెట్​ సంపాదించాడు. తెలుగు ప్రేక్షకులు కమల్ హాసన్​ను పరాయినటుడిగా చూడరు. అంతలా తెలుగు ఆడియన్స్​కు దగ్గరయ్యాడు కమల్​.

కానీ ఇటీవల తెలుగులో ఆయన మార్కెట్​ పూర్తిగా తగ్గిపోయింది. 2002 లో వచ్చిన పంచతంత్రం మినహా.. అప్పటినుంచి కమల్​ హాసన్​ ఒక్క సినిమా కూడా తెలుగులో ఆడలేదు. విశ్వరూపం, ఈనాడు, దశావతరం, చీకటిరాజ్యం ఇలా అన్ని సినిమాలు పెద్దగా ఆడలేదు. ఇవన్నీ బయ్యర్లకు నష్టాలే తెచ్చిపెట్టాయి. దీంతో కమల్​ సినిమాను కొనుగోలు చేయాలంటేనే ఇక్కడి బయ్యర్లు భయపడే పరిస్థితి నెలకొన్నది.

Also Read: పాపం సిద్ధార్థ్.. హీరోల వయసు టాపిక్ వస్తే చాలు.. వెళ్ళనీ అతడి వైపే..!

కానీ రీసెంట్​గా కమల్​ హాసన్​ విక్రమ్​ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి తెలుగులో అనూహ్యంగా మార్కెట్ ఏర్పడిదంట. దాదాపూ రూ. 11 కోట్ల మార్కెట్ ఉన్నట్టు టాక్​. ప్రస్తుతం తమిళ హీరోలు విజయ్​, విశాల్​, కార్తీ , సూర్య తదితరులకు ఇక్కడ మార్కెట్​ ఉంది. వారితో పోలిస్తే కమల్ కు మార్కెట్​ తక్కువ. కానీ విక్రమ్​ చిత్రానికి లోకేశ్​ కనగరాజ్​ దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాక ఈ చిత్రంలో విజయ్​సేతుపతి, పహాద్ ఫాజిల్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. లోకేశ్​ కనగరాజ్​ గత చిత్రాలు ఖైదీ, మాస్టర్​ తెలుగులో భారీ కలెక్షన్లు రాబట్టాయి. దీంతో కమల్​ హాసన్​కు ఇక్కడ మార్కెట్ పెరిగిందట. మరి ఈ చిత్రం సక్సెస్​ అవుతుందో? లేదో? వేచి చూడాలి.

Also Read: ఈ భామ జోరు చూస్తే ..పూజా హెగ్డే, రష్మికకు ఎసరు పెట్టేలా ఉందే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -