ఆర్​ఆర్​ఆర్​ మ్యూజిక్​ అరుపులేనా..!

- Advertisement -

రాజమౌళి చిత్రాల్లో సంగీతానికి ప్రత్యేక స్థానం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆయన మొదటి సినిమా స్టూడెంట్ నంబర్​ 1 నుంచి ప్రతి సినిమా మ్యూజికల్​ హిట్​గా నిలిచింది. ఆయన ప్రతి సినిమాకు రాజమౌళి సోదరుడు ఎంఎం కీరవాణి మ్యూజిక్​ అందిస్తుంటాడు. కీరవాణి ఇతర సినిమాలకు కూడా బాగానే మ్యూజిక్​ అందించినా.. రాజమౌళి చిత్రాలమీద ప్రత్యేక ఫోకస్​ పెడతాడన్న విషయం తెలిసిందే. రాజమౌళి ఆయనతో ప్రత్యేకంగా మ్యూజిక్​ను కంపోజ్​ చేయించుకుంటూ ఉంటాడు.

ఛత్రపతి, మగధీర,మర్యాద రామన్న, ముఖ్యంగా ఈగ చిత్రాలకు కీరవాణి అందించిన నేపథ్య సంగీతం ప్రతిఒక్కరిని ఆకట్టుకున్నది. ఇక బాహుబలి 1, 2కు ఇచ్చిన మ్యూజిక్​, బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం వీరి కాంబినేషన్​లో ఆర్​ఆర్​ఆర్​ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన మేకింగ్​ వీడియో సంచనాలను నమోదుచేస్తోంది. ఈ మ్యూజిక్​ చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -

ఇక సినిమాలోనూ మ్యూజిక్​ అద్భుతంగా ఉండబోతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఆర్​ఆర్​ఆర్​ చారిత్రక చిత్రం కావడం.. ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుండటంతో ఈ మూవీపై ఆసక్తి నెలకొన్నది. ఇండియన్​ సినిమాలోనే ఇదో ప్రత్యేక చిత్రంగా నిలిచిపోతుందని.. మ్యూజిక్​ పరంగా కూడా ఎన్నో సంచలనాలు నమోదు చేస్తుందంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక మూవీ దసరాకు విడుదల కాబోతుండటంతో.. ప్రేక్షకులు మాత్రం లిరికల్​ సాంగ్స్​ కోసం ఎదురుచూస్తున్నారు.

Also Read

చైతూకు నో చెప్పిన బేబమ్మ..! రీజన్​ ఏమిటో?

అమీర్​ఖాన్​పై ఆరోపణలు.. స్పందించిన చిత్ర యూనిట్ ..!

అల్లు అర్హ బిగ్ స్క్రీన్ పై ఎంట్రీ కన్ఫర్మ్.. అల్లు అర్జున్ ఎమోషనల్ ..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -