ర‌వికుమార్ చౌద‌రి దర్శకత్వంలో ఆది పినిశెట్టి

Hero Aadi Pinisetty Director Ravikumar Chowdary New Film Announcement

య‌జ్ఞం సినిమాతో కేరీర్ మొదలు పెట్టిన దర్శకుడు ఎ.య‌స్‌.ర‌వికుమార్ చౌద‌రి.. ఆ తర్వాత బాలయ్యతో తీసిన వీరభద్ర అనే సినిమా చేసినప్పటికి ఆ సినిమా అనుకున్న రెంజ్ లో హిట్ కాలేకపోయింది. ఆ తర్వాత పిల్లానువ్వులేని జీవితం సినిమా తీసాడు. ఈ సినిమా మంచి విజయం దక్కడంతో ర‌వికుమార్ చౌద‌రి స్టార్ డైరెక్టర్‍ల లిస్ట్ లో చేరిపోయారు.

అయితే ఇప్పుడు ఈ దర్శకుడు తన సొంత బ్యాన‌ర్‌ అయినట్టువంటి రుగ్వేద క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై యువ హీరో ఆది పినిశెట్టి హీరోగా ఓ సినిమాని రూపొందిస్తున్నారు. ఆ సినిమా మేడే నాడు ప్రారంభం కాబోతున్నట్లు ఆద్యా న్యూస్ కి అందుతున్న సమాచారం.  సినిమా మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను రూపొందించనున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ ఎంపిక జరుగుతోంది. ఇక ఈ సినిమాలో స్టార్ హీరో క్రేజ్ ఉన్న యాంగ్రీ హీరో విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. 

Related

  1. పవన్ రికార్డుని పటాపంచలు చేసిన అల్లు అర్జున్
  2. బన్నీని డైరెక్ట్ చేయనున్న నాని
  3. కాటమరాయుడు పై నితిన్ కామెంట్స్
  4. రాజేంద్ర ప్రసాద్ ముసలి ఏజ్ లవ్ స్టోరీ .. అల్లూ అర్జున్ ప్రొడ్యూసర్ !