ఎన్టీఆర్ తో సమంతకు గొడవ.. ఎందుకు..?

samantha playing negative role in jai lava kusa

జనతా గ్యారేజ్ మూవీ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న మరో సినిమా ‘జై లవ కుశ’. బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమచారం ప్రకారం ఈ సినిమాలో సమంత ఓ లేడీ విలన్ గెటప్‌లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే, సమంత కెరీర్‌లో ఆమె విలన్ పాత్ర పోషించిన చిత్రం ఇదే మొదటిది అవుతుంది.

జనతా గ్యారేజ్, రామయ్య వస్తావయ్య, రభస, బృందావనం వంటి చిత్రాల తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న ఐదవ చిత్రం ఇది. బాబీ డైరెక్ట్ చేస్తున్న జై లవ కుశ సినిమాలో సమంత, తారక్‌తో డీకొట్టే లేడీ విలన్ పాత్రలో కనిపించనుందని సినీవర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ విషయంపై మూవీ యూనిట్ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆగస్టులో రిలీజ్ కానున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, నివేదా థామస్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Related

  1. చైతూ.. సమంత పెళ్లికి బ్రేక్.. నాగ్ కి టెన్షన్ స్టార్ట్..
  2. సుచిలీక్స్‌ త్వరలో సిద్దు, సమంత సెక్స్ వీడియో
  3. అఖిల్ వల్ల.. ఇబ్బందుల్లో పడ్డ చైతు, సమంత
  4. టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ ఎవరో చెప్పిన సమంత!