నాగ శ్రీనుకు నాగబాబు సాయం

సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో మేకప్ మన్‌గా పని చేసిన నాగ శ్రీను.. తనను మంచు కుటుంబసభ్యులు ఘోరంగా అవమానించారంటూ మీడియాకెక్కిన సంగతి తెలిసిందే. తన తల్లిని అవమానించారంటూ ఆరోపించిన నాగ శ్రీను… మోకాళ్లపై కూర్చోబెట్టి తనను తీవ్ర భయాందోళనకు గురిచేశారని ఆరోపించారు.

ఈ ఘటనపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఉప్పలపు నాగ శ్రీను ప్రస్తుతం కష్టకాలంలో ఉన్నారని మెగా బ్రదర్ అన్నారు. అతని తల్లి ఆరోగ్యం మరింత క్షీణించడం, అతనికి గత సంస్థ నుండి జీతం కూడా సరిగ్గా అందకపోవడంతో తీవ్ర ఇబ్బంది గురవుతున్నారని తెలిసిందన్నారు.

నాగ శ్రీను ఆర్ధిక స్థితికి చిరు సాయంగా నాగబాబు 50వేల రూపాయలు అందించారు. నాగ శ్రీను పిల్లల అనారోగ్య సమస్యకు పూర్తి వైద్య సహాయం సైతం అందిస్తానని హామీ ఇచ్చారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించడానికి సకల ఏర్పాట్లకు మెగా సపోర్ట్ ఉంటుందని నాగబాబు తెలిపారు.

పవన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ?

విజయ్ దేవరకొండ పాన్ ఇండియా ప్రేమకథ

మళ్లీ తెరపై చిరు విశ్వరూపం