చింతమనేని హత్యకు కుట్ర

తనకు ప్రాణహానీ ఉందంటూ పోలీసులకు కంప్లైంట్‌ చేశారు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌. ఇందుకోసం ఓ షూటర్‌ ను కూడా నియమించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బెదిరింపు కాల్స్‌పై ఆయన ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఓ ఆగంతకుడి నుంచి తనకు ఫోన్‌ వచ్చిందని కంప్లైంట్‌ లో వివరించారు. తన హత్యకు షూటర్లను నియమిస్తున్నారని తెలిపారు. గన్‌ మెన్‌ లకు వ్యక్తిగతంగా జీతాలు చెల్లించే ఆర్థికస్థోమత తనకి లేదన్నారు.

అందుకే ప్రభుత్వమే తనకు ఉచిత భద్రత కల్పించాలని పోలీసులను కోరారు. అటు తనకు ప్రాణహాని ఉందని ఇటీవలే చింతమనేని ఏలూరు కోర్టులోనూ పిటిషన్‌ దాఖలు చేశారు.

Also Read

ఉద్యోగులపై సజ్జల కామెంట్స్

జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయ్

పొత్తులపై కార్యకర్తలకు పవన్ దిశా నిర్దేశం