Friday, March 29, 2024
- Advertisement -

జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయ్

- Advertisement -

జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఒంగోలు వేదికగా జరిగిన మహానాడులో జగన్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. టీడీపీకి జనాలు ఉన్నారని.. వైసీపీకి బస్సులున్నాయని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అధికారం పోతే ఆ బస్సులు కూడా వైసీపీకి ఉండవన్నారు.

మహానాడును అడ్డుకునేందుకు పోలీసులు ఎంతగానో ప్రయత్నించారని చెప్పారు. మహానాడు వాహనాలకు గాలి తీసేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం గాలి తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. జగన్ మూడేళ్ల పాలనలో లక్షా 75 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే జగన్ అవినీతి సొమ్మును కక్కిస్తామని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసిందనీ..సామాన్యులపై ఆ భారాన్ని మోపుతోందని మండిపడ్డారు.

టమోటా ధర కేజీ 120కి చేరిందనీ, దేశంలోనే పెట్రోల్ ధర ఏపీలోనే ఎక్కువన్నారు. శ్రీలంక మాదిరిగా ఏపీలో పరిస్థితి దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధుడే బాధుడు కార్యక్రమానికి పోటీకీ ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు నిర్వహిస్తోందనీ..ప్రజలకు ఎక్కడికక్కడ మంత్రులను నిలదీస్తున్నారన్నారు.

యడియూరప్పకు మరో షాక్ ఇచ్చిన బీజేపీ

కేసీఆర్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్

జూన్ 1,2 తేదీల్లో టీపీసీసీ చింతన్ శిబిర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -