పొత్తులపై కార్యకర్తలకు పవన్ దిశా నిర్దేశం

- Advertisement -

టీడీపీతో జనసేన పొత్తు ఉంటుందా ? పొత్తులపై ఇప్పటివరకు జనసేన కానీ టీడీపీ కానీ పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వలేదు. పొత్తు ఉంటుందని ఒకసారి.. ఉండదని ఒకసారి ఎవరికి వారు సంకేతాలిచ్చారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులపై చేసిన కామెంట్స్‌ కీలకంగా మారాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం చాలా సార్లు తగ్గామనీ.. ఈ సారి మిగతా వాళ్లు తగ్గితే బాగుంటుందన్నారు.

2014లో టీడీపీ, బీజేపీతో కలిసి ముందుకెళ్లమన్న పవన్ ఈ సారి తమ ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తుతో ప్రభుత్వ ఏర్పాటు, బీజేపీ టీడీపీతో కలిసి ముందుకు వెళ్లడం లేదా ఒంటరిగా బరిలో దిగడం. ఈ మూడింటిలో ఏదో ఆఫ్షన్ ఉందన్నారు.

- Advertisement -

అయితే పొత్తుల విషయాన్ని లైట్‌గా తీసుకుని జనసైనికులు పని చేయాలని పిలుపునిచ్చారు. జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయ్

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -