విజయ్ ని దెబ్బకొట్టిన ఓవర్ కాన్ఫిడెన్స్ ?

Vijay Devarakonda Liger Movie Over Confidence Hurt
Vijay Devarakonda Liger Movie Over Confidence Hurt

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ ” లైగర్ ” . భారీ అంచనాల నడుమ ఇటీవల ఆగష్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. మొదటి రోజు నుంచే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. మూవీలో కథ ఏమి లేదని, అసలు ఇది పూరీ జగన్నాథ్ సినిమాలా లేదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. అసలు కథే లేని సినిమాకు అంతా భారీ హైప్ ఎందుకు క్రియేట్ చేశారని సగటు ప్రేక్షకుడు ప్రశ్నిస్తున్నాడు.

విడుదలకు ముందు ఈ మూవీ ప్రమోషన్స్ విజయ్ ఏ స్థాయిలో చేశాడో అందరికీ తెలిసిందే. ఈ మూవీ తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని, దాదాపుగా 500 నుంచి 1000 కోట్ల వరకు వసూళ్లు రాబడుతుందని, విజయ్ బల్లగుద్ది చెప్పాడు. అంతే కాకుండా ” థియేటర్లు పగిలిపోవాలే.. రికార్డులు తిరగరాయలే.. ” అంటూ అగ్రేస్సివ్ స్పీచ్ లతో ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు పెంచాడు విజయ్ దేవరకొండ. దాంతో విజయ్ కాన్ఫిడెన్స్ చూసి థియేటర్స్ కు వెళ్ళిన ఫ్యాన్స్ కంగు తిన్నారు.

అసలు ఇది తెలుగు మూవీలా లేదని, ఇంత వీక్ మూవీ పై విజయ్ ఎందుకంత హైప్ క్రియేట్ చేశాడని నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్ ల్లో కూడా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది లైగర్. అయితే గతంలో అర్జున్ రెడ్డి మూవీ టైమ్ లో కూడా ఇలాగే ఓవర్ కాన్ఫిడెంట్ చూపి బ్లాక్ బస్టర్ కొట్టాడు విజయ్ దేవరకొండ. కానీ ” లైగర్ ” విషయంలో ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బతీసిందనే చెప్పవచ్చు.

Also Read

SSMB28 : మహేశ్ కు మరో ” పోకిరి ” పక్కా !

సలార్ పోస్టర్ రిలీజ్.. నిరాశలో ఫ్యాన్స్ !

రాజమౌళి టార్చర్ కు మహేష్ సిద్దమయ్యాడా ?