Friday, April 26, 2024
- Advertisement -

కుప్పం రగడ.. ఎవరి ప్లాన్ ?

- Advertisement -

చిత్తూరు జిల్లా కుప్పం నియోజిక వర్గం అనగానే టీడీపీ కంచుకోట, చంద్రబాబు అడ్డాగా చెబుతుంటారు టీడీపీ శ్రేణులు. చాలాసార్లు ఇదే నిరూపితం అయ్యింది కూడా. అందుకే చంద్రబాబు హయాంలో కుప్పంపై ప్రత్యేక ఫోకస్ పెడుతూ అక్కడ చాలా అభివృద్ది కార్యక్రమాలు చేశారు. ఇక్కడ కేవలం టీటీపీ తప్పా.. ఇతర పార్టీల ప్రస్తావననే ఉండదంటే అతిశయోక్తి కాదు. గత ఎన్నికల్లో కూడా అత్యధిక మెజారిటీతో చంద్రబాబుకు గెలుపు కట్టబెట్టారు కుప్పంవాసులు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి ఊహించని రీతిలో మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ముందంజ వేసింది. ఇది టీడీపీకి అతిపెద్ద షాక్ అనే చెప్పాలి. దీంతో టీడీపీకి కంచుకోటగా ఉన్న కుప్పం ప్రజలు మెల్లమెల్లగా వారి అభిప్రాయాలను మార్చుకుంటూ ఇతర పార్టీవైపు చూస్తున్నారా ? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి..

కుప్పం ప్రజల్లో వస్తున్న మార్పుతో వైసీపీ నేతల్లో ఉత్సాహం పెరుగుతూ ఉంటే, టీడీపీ శ్రేణుల్లో మాత్రం ఆందోళనలు పెరుగుతున్నాయి. కుప్పం ప్రజల్లో వస్తున్న మార్పు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వైఎస్ జగన్ కుప్పం పై ప్రత్యేకదృష్టి పెడుతూ అక్కడ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అక్కడి నాయకులకు దిశనిర్దేశం కూడా చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాల్లో గెలుపు కుప్పం తోనే ప్రారంభం కావాలని జగన్ అమద్య చెప్పిన మాటలను బట్టి చూస్తే కుప్పం పై జగన్ ఎంతలా ఫోకస్ పెట్టారో అర్థమౌతోంది. దీంతో చేజారిపోయే కుప్పంలో పట్టు నిలబెట్టుకునేందుకు..చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇక తాజాగా చంద్రబాబు కుప్పం టూర్ ఏపీ రాజకీయాల్లో అగ్గి రాజేస్తోంది. రెండు రోజులుగా కుప్పంలో పర్యటిస్తున్న బాబును వైసీపీ శ్రేణులు అడ్డగిస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు.

అయితే తన సొంత నియోజిక వర్గంలోనే వైసీపీ శ్రేణులు అడ్డగిస్తుండడంతో చంద్రబాబు రోడ్డుపైనే బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. అయితే బాబు పర్యటనను వైసీపీ శ్రేణులు ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారు ? అసలు ఇది ఎవరి ప్లాన్ ? అనే దానిగురించి రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు ను అడ్డుకోవడం వల్ల కుప్పంలో వైసీపీ ఆధిక్యం పెరిగింది అనే సంకేతాలను పంపాలనేది జగన్ ప్లాన్ గా కొందరి అభిప్రాయం. ఇక మరొక వాదన ఏమిటంటే.. చంద్రబాబు పథకం ప్రకారమే కుప్పం ప్రజల్లో సానుభూతి కోసం సొంతంగా అడ్డగింపు చర్యలకు పాల్పడుతున్నడని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో అపార చాణక్యుడిగా ఉన్న చంద్రబాబు.. గతంలో కూడా ఎన్నో వ్యూహాత్మక ప్రణాళికలు వేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఏది ఏమైనప్పటికి కుప్పం లో రాజుకున్న రాజకీయ రగడ ఏపీలో పోలిటికల్ హిట్ ను పెంచుతోంది.

Also Read

కే‌సి‌ఆర్ భయపడుతున్నారా.. భయపెడుతున్నారా ?

పవన్ను అందుకే టార్గెట్ చేస్తున్నారా ?

ఓటర్ల కాళ్ళు మొక్కితే ఓట్లు వేస్తారా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -