Wednesday, April 24, 2024
- Advertisement -

జగన్ ” ఫ్లెక్సీ బ్యాన్”.. సాధ్యమేనా ?

- Advertisement -

ఏపీలో సి‌ఎం జగన్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలతో ముందుకు వెల్తోన్న సంగతి అందరికీ తెలిసిందే. పాఠశాలల్లోనూ, సంక్షేమ పథకాల విషయంలోనూ, ఇంకా చాలా వాటిలో ఊహించని విధానాలను ప్రవేశ పెడుతున్నారు. అయితే జగన్ ప్రవేశ పెట్టె కొన్నిటిపైన ప్రజల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతూ వస్తోంది. ఇక తాజాగా సి‌ఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకొని పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా నిలిచారు. ఇక నుంచి ఏపీలో కఠినంగా ప్లాస్టిక్ బ్యాన్ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలు పూర్తిగా నిషేదించాలని విశాఖపట్నంలో జగన్ ప్రస్తావించారు. అయితే ఈ ఫ్లాస్టిక్ ఫ్లెక్సీలు పూర్తిగా బ్యాన్ చేయడం సాధ్యమేనా ? అనే విషయాన్ని కాస్త వివరంగా చర్చించుకుందాం ! .

ఒకప్పుడు ఫ్లెక్సీలు అనేవి చాలా అరుదుగా కనిపించేవి.. ఏ సినీ హీరోల వరకో.. లేదా రాజకీయ నాయకుల వరకో పరిమితంగా నిలిచేవి. కానీ నేటి రోజుల్లో ముఖ్యంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలు వచ్చిన తరువాత.. వాటి ధర చాలా తక్కువ కావడంతో.. ఫ్లెక్సీలు అనేవి విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. ఇక రాజకీయ నాయకుల ఫ్లెక్సీల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఏదైనా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు ఏదైనా కార్యక్రమానికి వస్తున్న, లేదా ఆయా నియోజిక వర్గాలలో పర్యటిస్తున్న ఆ నియోజిక వర్గం అంత పదడుగులకు ఒక చోట వారి నాయకుల ఫోటోలతో ఫ్లెక్శీలనూ నింపేస్తూ ఉంటారు.. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు ఫ్లెక్శీలను చాలా ప్రేస్టేజియస్ గా కూడా భావిస్తుంటారు కూడా. ఆ స్థాయిలో ఫ్లెక్సీల ప్రభావం రాజకీయ నాయకులపై గట్టిగానే ఉంది.

ఇక ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డి విషయానికొస్తే.. ఆయనకు పబ్లిసిటీ వ్యామోహం ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేయాల్సిన సచివాలయాలను కూడా తన పార్టీ రంగులతో నింపిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుంది. ఇక ఆయన ఏదైనా కార్యక్రమానికి విచ్చేయునప్పుడు ఆయన బొమ్మతో ఉన్న పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ( దాదాపుగా 12-20 అడుగులు ) అడుగడుగున కనిపిస్తూ ప్రజలకు ఇబ్బందికరంగా మారిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మరి ఈ స్థాయిలో పబ్లిసిటీ వ్యామోహం ఉన్న జగన్.. ఫ్లెక్శీలను బ్యాన్ చేయగలరా ? అనేది ప్రశ్నార్థకమే. ఎందుకంటే గతంలో మద్యపాన నిషేదం విషయంలో కూడా ఇదే విధంగా ధీమా వ్యక్తం చేసి.. ఎలా మాట మార్చరో మానందరికి తెలిసిందే. మరి ఫ్లెక్సీల బ్యాన్ విషయంలో కూడా జగన్ మాట మార్చే అవకాశాలు గట్టిగానే ఉన్నాయని కొందరి అభిప్రాయం.

Also Read

కుప్పం రగడ.. ఎవరి ప్లాన్ ?

ప్రజలను ఏమార్చే కుట్ర చేస్తోన్న మోడీ !

లెఫ్ట్ ఓట్లకు బీజేపీ గాలం..టి‌ఆర్‌ఎస్ కు పెద్ద దేబ్బే !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -