రాజమౌళి టార్చర్ కు మహేష్ సిద్దమయ్యాడా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఖలేజా, అతడు వంటి క్లాసిక్ హిట్స్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీకి సంబంధించి మహేష్ బాబు బర్త్ డే కానుకగా అప్డేట్ వస్తుందేమో అని ఎదురు చూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది.

ఈ సంగతి అలా ఉంచితే మహేష్ బాబు త్రివిక్రమ్ మూవీ తరువాత దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ గురించి ఇటీవల నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు మహేష్ బాబు. ” రాజమౌళితో పని చేయడం తన డ్రీమ్ అని, ఆయనతో సినిమా చేయడం అంటే 25 సినిమాలకు పెట్టాల్సిన ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుందని, దానికి నేను సిద్దంగా ఉన్నానని ” తెలిపాడు.

మహేష్ బాబు మాటలను బట్టి చూస్తే రాజమౌళి తన హీరోలను ఏ స్థాయిలో కష్టపెడతాడో చెప్పకనే చెప్పాడు. ఆ మద్య ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ లో రాజమౌళి హీరోలను ఎంత కష్టపెడతాడో జూ.ఎన్టీఆర్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్, ప్రభాస్ వంటి హీరోలు సైతం రాజమౌళి పర్ఫెక్క్షన్ కోసం ఏ స్థాయిలో కండలు పెంచారో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. దాంతో వీరి బాటలోనే మహేష్ ను కండలు తిరిగిన దేహంతో రాజమౌళి చూపిస్తాడా ? లేదా మహేష్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా రాజమౌళి కాంప్రమైజ్ అవుతాడా అనేది తెలియాలంటే వీరిద్దరి ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళేంతవరకు వెయిట్ చెయ్యల్సిందే.

Also Read: అమీర్ ఖాన్ కూడా చేతులెత్తేశాడుగా ..!

Related Articles

Most Populer

Recent Posts