మాజీ లవర్.. ఓ రోజు మాతో పడుకుంటావా అని అడిగినందుకు.. ఏ నటి ఏం చేసిందో తెలుసా..?

tv actress roopa molestation kannada police

కన్నడ సినీ పరిశ్రమకు చెందిన వర్ధమాన నటిని ఇద్దరు యువకులు అడ్డగించి.. ఒక రోజు రాత్రి మాతో గడుపుదువురా.. అంటూ లాక్కుపోయారు. తీవ్రంగా ప్రతిఘటించిన ఆ యువతి వారి నుండి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ఆదివారం రాత్రి బెంగళూరులోని హెగ్గనహళ్ళిలో చోటుచేసుకుంది. షూటింగ్ కంప్లీట్ చేసుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో నటిని సచిన్, ప్రవీణ్ అనే ఇద్దరు వ్యక్తులు అడ్డగించారు. ఈ ఇద్దరితో ఆమెకు గతంలోనే పరిచయం ఉంది.

ఆమెను తమతో రావాలని పిలిచారు. అందుకు ఆమె రానని చెప్పగా.. ఆమెను లాక్కెళ్ళడానికే యత్నించారు. ఈరోజు రాత్రికి మాతోనే ఉందువురాఅంటూ లాక్కెళ్ళబోయారు. దాంతో వారి నుండి ఆమె ఎలాగో అలా తప్పించుకొని ఇంటిలోకి చేరుకుంది. ఈ విషయమై ఆమె రాజగోపాల్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఐపీసీ సెక్షన్ 354 కింద సచిన్, ప్రవీణ్ అలియాస్ పుట్ట మీద కేసులు నమోదు చేశారు. ప్రవీణ్, వర్థమాన నటి గతంలో స్నేహితులు.

ప్రవీణ్ ప్రవర్తనలో మార్పు గమనించిన ఆమె అతన్ని దూరంగా పెట్టడం మొదలుపెట్టింది. తనను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడని.. ఒప్పుకోనందుకు ఎన్నో సార్లు బెదిరించాడని.. వాట్సప్ లో అశ్లీల ఫోటోలు.. అభ్యంతకర మెసేజీలు పంపేవారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. ఆదివారం ఒంటరిగా వెళుతున్న తనను కారులో వెంబడించడమే కాకుండా తనను బలాత్కరించాలని ప్రయత్నించారని ఆమె తెలిపింది.

{youtube}fqLXVP4ldms{/youtube}

Related

  1. లవర్ తో గొడవపడ్డ నయనతార… కారణం ఇదే
  2. యంగ్ హీరో తో ఎఫైర్.. కొత్త లవర్ కి షాక్
  3. మాజీ లవర్ ని కోరిక తీర్చాల‌ని బ్లాక్ మెయిల్ చేసిన యువ‌తి.. చివర్లో ఊహించని ట్విస్ట్
  4. నానికి పవన్ లవర్ కి లింక్ ఏంటి..?