Friday, May 3, 2024
- Advertisement -

ఉత్త‌ర కొరియా దుందుడ‌కుతో అంత‌ర్జాతీయంగా ప‌రిస్థితులు ఉద్రిక్తం…..

- Advertisement -
north korea warns to america of nuclear test at any time

అమెరికా శాంతి చ‌ర్చ‌ల‌కు ప్ర‌య‌త్నిస్తుంటే …మ‌రోవైపు ఉత్త‌ర‌కొరియా దుందుడుకుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఐక్య‌రాజ్య‌స‌మితి,ఆమెరికా ఆంక్ష‌ల‌ను ఏమాత్రం లెక్క‌చేయ‌కుండా యుద్ధానికి కాలు దువ్వుతోంది. అన్వ‌స్త్ర ప‌రీక్ష‌ల‌ను ఆపే ప్ర‌స‌క్తేలేద‌ని …వాటిని కొన‌సాగిస్తామ‌ని ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ స్ప‌ష్టం చేశారు. అమెరికా దాని మిత్ర‌దేశాలు మాపై దాడి చేసేముందు మేమె దాడి చేస్తామ‌ని హెచ్చ‌రించారు.తాజాగా ఇప్పుడు అమెరికాతో చ‌ర్చ‌లు లేవ‌ని ఏక్ష‌ణ‌మైనా అన్వాయుధాల‌ను ప్ర‌యేగిస్తామని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

అమెరికా, ఉత్త‌ర‌కొరియా మ‌ధ్య అంతంత మాత్రంగా ఉన్న ప‌రిస్థితులు మ‌రింత విష‌మిస్తున్నాయి. ఇరు దేశాల అధ్య‌క్షులు మొండిగా ఉండ‌డంతో ప‌రిస్థితి అదుపుత‌ప్పుతోంద‌న్న‌భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ట్రంప్ కొంత సానుకూలంగా ఉన్న కిమ్ మాత్రం త‌గ్గ‌డంలేదు. అమెరికాలోని ప్ర‌ముఖ ప్రాంతాల‌పై అణ్వాయి ధాలు ప్ర‌యేగిస్తామ‌ని మ‌రింత రెచ్చ గొట్టే ప్ర‌క‌ట‌న‌లు మ‌రింత క‌ల‌కలం రేపుతున్నాయి. ఇప్ప‌టికే అమెరికా మిలిట‌రీ నిర్వ‌హిస్తున్న డ్రిల్స్‌, రెచ్చ‌గొట్టే ప‌ద్ద‌తుల ప‌ట్ల కిమ్ ఆగ్ర‌హంతో ఊగిపోతున్నార‌ని ఉత్త‌ర‌కొరియాకు చెందిన ఒక ప్ర‌ముఖ ప‌త్రిక క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

అమెరికాకు బుద్ది చెప్పాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన కిమ్ … అణుదాడి చేసేందుకు కూడా త‌న సైన్యాన్ని సిద్ధం చేస్తున్నార‌ని వెల్ల‌డించింది. అమెరికా ప్రధాన భూభాగాలను ధ్వంసం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, ఏ క్షణంలోనైనా దాడి జరిగే అవకాశం ఉందని వార్తను ప్రచురించింది. కిమ్ నిర్ణ‌యానికి కార‌ణం జ‌పాన్, ద‌క్షిణ కొరియాల‌తో కలిసి అమెరికా ద‌ళాలు నిర్వ‌హిస్తున్న యుద్ధ స‌న్నాహాలేన‌ని ప‌త్రిక చెబుతోంది.అమెరికాను ధ్వంసం చేయ‌గ‌ల అణుసామ‌ర్ద్యం, సాంకేతిక ప‌రిజ్ఞానం ఉత్త‌ర‌కొరియా వ‌ద్ద ఉంద‌ని కాబ‌ట్టి స‌మ‌స్య‌ను సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించ‌కుంటే తీవ్ర న‌ష్టం త‌ప్ప‌ద‌ని ఉత్త‌ర‌కొరియా ప‌త్రిక అభిప్రాయ‌ప‌డింది.

అమెరికా మాత్రం కొంత వెన‌క్కి త‌గ్గిని ఉత్త‌ర కొరియా మాత్రం రెట్టించిన ఉత్సాహంతో మ‌రింత దూకుడుగా వెల్తోంది. యుద్ధం చేసేంద‌కు సిద్ధంగా ఉన్నామంటూ సంకేతాలు పంప‌తున్నారు.దీంతో అంత‌ర్జాతీయంగా ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి.ట్రంప్ ఉత్త‌ర కొరియాను క‌ట్ట‌డి చేయాల‌ని శాంతియుత ప్ర‌య‌త్నాలు చేస్తున్నా … కిమ్ మాత్రం అగ్ర‌రాజ్యంతో తాడోపేడో తేల్చుకొనేందుకు సిద్ధంగా ఉన్నారు.మరి కిమ్ మాటలు ఎలాంటి ప‌రిస్థితులకు దారి తీస్తాయోన‌న్న భ‌యం అంత‌ర్జాతీయంగా నెల‌కొంది.

Related

  1. యుద్ధం చేయ‌డానికి సిద్ధం …క‌య్యానికి కాలు దువ్వుతున్న ఉత్త‌ర కొరియా ..
  2. భార‌త ఐటీ నిపుణుల‌కు ర‌ష్యాబంప‌ర్ ఆఫ‌ర్‌
  3. ఆంధ్రా ప‌ప్పు లోకేష్‌.. పులి జ‌గ‌న్‌..
  4. ఆర్మీ జరిపిన కాలుపులో పాకిస్థాన్ కు చెందిన రెండు బంకర్లు ద్వంసం.. ఏడు సైనికులు మృతి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -