పవన్ ను పక్కన పెట్టిన హరీష్ శంకర్.. మరి “భవదీయుడు” ఉన్నట్లా.. లేనట్లా ?

Pawan Kalyan Replaced Vijay Devarakonda in Bhavadeeyudu Bhagat Singh Movie
Pawan Kalyan Replaced Vijay Devarakonda in Bhavadeeyudu Bhagat Singh Movie

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం అటు సినిమాలను.. ఇటు పాలిటిక్స్ ను రెండిటినీ ప్యారలల్ గా రన్ చేస్తూ దూసుకుపోతున్నాడు. రాజకీయాల్లో ప్రస్తుతం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న పవన్.. సినిమాలకు కూడా అంతే సమయాన్ని కేటాయిస్తున్నాడు. ప్రస్తుతం హరిహర వీరమల్లు మూవీని సెట్స్ పై ఉంచిన పవన్.. మరో రెండు ప్రాజెక్ట్ లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే వాటిలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ” భవదీయుడు భగత్ సింగ్ ” మూవీ ఒకటి.. మరొకటి స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ కు పవన్ కమిటైయ్యాడు.

అయితే ఈ రెండు ప్రాజెక్ట్ లలో హరీష్ శంకర్ మూవీ కోసం పవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ” గబ్బర్ సింగ్ ” మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో ఎన్నో రోజులుగా ఈ కాంబినేషన్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. ఫైనల్ గా ఈ క్రేజీ కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో మూవీ రాబోతున్నట్లు గత ఏడాది అధికారిక ప్రకటన ఇచ్చారు. అయితే ప్రకటన ఇచ్చి ఇప్పటికీ ఏడాది గడిచిన ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. దాంతో ఈ ప్రాజెక్ట్ ఉంటుందా ఉండదా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.

ఇక ప్రస్తుతం పవన్ సెట్స్ పై ఉన్న హరిహర వీరమల్లు మూవీని త్వరగా కంప్లీట్ చేసి.. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం మాత్రమే ఉండడంతో పాలిటిక్స్ లో ఫుల్ యాక్టివ్ కావాలనే ప్లాన్ లో ఉన్నాడు. దాంతో హరీష్ శంకర్ ప్రాజెక్ట్ అట్టకెక్కినట్టే అని ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది. హరీష్ శంకర్ కూడా పవన్ కోసం ఎదురుచూడడం మానేసి వేరే హీరోతో మూవీ ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే విజయ్ దేవరకొండకు స్టోరీ కూడా వినిపించినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే హరీష్ శంకర్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందట. మరి ఇన్నాళ్ళు పవన్ కోసం ఎదురుచూసిన హరీష్ ఇప్పుడు వేరే హీరోతో మూవీకి సిద్దమౌతుండడంతో ” భవదీయుడు భగత్ సింగ్ ‘ మూవీ హోల్డ్ లో పడినట్లేననే టాక్ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి

రాజమౌళి చేతుల్లోకి ” ఆది పురుష్ “.. నిజమేనా ?

మహేష్ తో పోటీ.. ఆ పాన్ ఇండియా మూవీ నిలబడగలదా ?

రాంచరణ్ కు నెక్స్ట్ సినిమా కష్టాలు !