Thursday, May 2, 2024
- Advertisement -

వింటర్ లో చర్మం పొడిబారుతోందా.. ఇలా చేయండి !

- Advertisement -

చలికాలంలో చాలా రకాల ఆరోగ్య సమస్యలు తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. జలుబు, దగ్గు వంటి సమస్య లతో పాటు ముఖ్యంగా పొడి చర్మ సమస్య చాలా మందిని వేదిస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లలలో ఈ పొడి చర్మ సమస్య అధికంగా ఉంటుంది. అలాగే పెద్ద వాళ్ళను కూడా ఈ సమస్య వెంటాడుతుంది. థైరాయిడ్, సోరియాసిస్, డయాబీటీస్ ఉన్నవారికి ఈ సమస్య మరి అధికంగా ఉంటుంది. చర్మం పొడిబారడమే కాకుండా పగుళ్లు కూడా ఏర్పడి విపరీతమైన నొప్పిని కలుగజేస్తాయి.

అయితే ఈ చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా శరీలానికి కావలసిన వాటర్ ను కచ్చితంగా తీసుకోవాలని, అనగా రోజుకు 3 నుంచి 4 లీటర్ల వరకు నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. చాలా మంది వింటర్ లో అధిక నీరు తాగేందుకు ఇష్టపడరు. అందువల్లే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అందువల్ల నీరు ఎక్కువగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక చర్మం పొడిబారకుండా ఉండేందుకు ఎక్కువగా మార్చరైజర్స్ వాడాలని చెబుతున్నారు.

అలాగే స్నానం చేసే ముందు నీటిలో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ గాని లేదా కొబ్బరి నూనె గాని వేసుకొని స్నానం చేయాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుందట. అలాగే స్నానానికి మూడు కూడా బొబ్బెరి నూనె రాసుకొని ఒక అరగంట తరువాత స్నానం చేస్తే పొడి చర్మానికి చెక్ పెట్టె అవకాశం ఉందట. అలాగే మనం డైలీ యూస్ చేసే నార్మల్ సబ్బులను దూరంగా ఉంచాలని, వాటి స్థానంలో మార్చరైజర్ సోప్స్ లేదా గ్లిజరిన్ సోప్స్ వదలని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

చలికాలంలో జలుబు కు చెక్ పెట్టాలంటే ఇలా చేయండి !

ఆకలి వేయడం లేదా.. అయితే ఇలా చేయండి !

చలికాలంలో వేడి నీళ్ళతో స్నానం చేస్తే.. అంతే సంగతులు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -