డెడికేషన్ అంటే ఇది.. ఫిదా చేస్తోన్న రామ్ చరణ్ !

Ram Charan works out in outdoor gym on Africa holiday, fans love his dedication
Ram Charan works out in outdoor gym on Africa holiday, fans love his dedication

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉండే సూపర్ ఫిట్ హీరోలలో రామ్ చరణ్ ఒకరు. ఆయన ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మొదటి సినిమా చిరుత నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన ” ఆర్ ఆర్ ఆర్ ” వరకు ఒకే రకమైన ఫిజిక్ మైన్ టైన్ చేస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తూ ఉంటాడు. ముఖ్యంగా చరణ్ సిక్స్ పాక్ ను ఒకే రకంగా మెన్ టైన్ చేయడంలో ముందు వరుసలో ఉంటాడు. ” ఆర్ ఆర్ ఆర్ ” మూవీలో చరణ్ సిక్స్ పాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కండలు తిరిగిన దేహంతో తన పర్సనాలిటీ ద్వారా రామరాజు పాత్రకు చరణ్ ప్రాణం పోశాడానే చెప్పవచ్చు. ఇక గతంలో దృవ మూవీలో కూడా చరణ్ సిక్స్ పాక్ తో కనిపించిన విషయం తెలిసిందే.

ఇక మరోసారి తన అప్ కమింగ్ మూవీ లో చరణ్ సిక్స్ పాక్ తో మెరవనున్నట్లు తెలుస్తోంది. చరణ్ షూటింగ్ స్పాట్ లో వర్కౌట్స్ చేస్తోన్న వీడియోను తన ఇన్స్టగ్రామ్ షేర్ చేశాడు. ఎలాంటి ప్రొఫెషనల్ జిమ్ కు సంబంధించిన వస్తువులు లేకపోయినప్పటికి, షూటింగ్ స్పాట్ లోనే తయారు చేసిన జిమ్ సామన్లతోనే వర్కౌట్స్ చేస్తూ, కష్టపడానికి జిమ్ అవసరం లేదంటూ ఇంస్టా లో షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన అభిమానులు రాంచరణ్ డెడికేషన్ కు ఫిదా అవుతున్నారు ఫిట్ నెస్ లో నీకు నువ్వే పోటీ అంటూ రాంచరణ్ విడియోపై కామెంట్లు పెడుతున్నారు అభిమానులు.

ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ప్రస్తుతం శంకర్ మూవీ డైరెక్షన్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో రాంచరణ్ మూడు విభిన్న పాత్రలలో నటిస్తున్నానే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అందుకే పాత్రలకు తగినట్లుగా చరణ్ మొకొవర్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ నుంచి అప్డేట్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇక త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను విడుదల చేసేందుకు చిత్రా యూనిట్ సిద్దమౌతుంట. ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం వచ్చే నెల క్రిస్మస్ కానుకగా ఈ మూవీ నుంచి అప్డేట్ వచ్చే అవకాశం ఉందట.

ఇవి కూడా చదవండి

అయ్యో :మహేశ్ కు 2022 అంతా చేదు జ్ఞాపకాలే!

అల్లు అర్జున్ ” ఐకాన్ ” లేనట్లేనా ?

నాగ్, వెంకీ మూవీస్ కు బ్రేక్.. ఇవ్వబోతున్నారా ?