Tuesday, April 30, 2024
- Advertisement -

బండి సంజయ్ షాక్ తప్పదా..హైకమాండ్ చూపు ఎవరివైపు?

- Advertisement -

ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ బలం అంతకంతకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు కే మాత్రమే పరిమితం అయిన బీజేపీ ఇప్పుడు టి‌ఆర్‌ఎస్ పార్టీకే ధీటైన ప్రత్యర్థి పార్టీగా బలం పెంచుకుంది. గతంలో టి‌ఆర్‌ఎస్ తరువాతి స్థానంలో కాంగ్రెస్ ఉండగా.. ఇప్పుడు కాంగ్రెస్ వెనక్కి నెట్టి రెండవ స్థానానికి చేరుకుంది. ఇటీవల జరిగిన మునుగోడు ఉపఎన్నికతో ఇది నిరూపితం అయింది. మరి కేవలం ఈ నాలుగేళ్ల కాలంలోని బీజేపీ ఇంత బలం పెంచుకోవడానికి ప్రధాన కారణం బండి సంజయ్ నాయకత్వమే అని కాషాయ దళంలో ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. 2020లో ఆయన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పదవి బాద్యతలు చేపట్టారు.

అప్పటి నుంచి పార్టీ ని బలపరచడంలో బండి సంజయ్ దే కీలక పాత్ర. హిందూ భావజాలాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ.. అగ్రేస్సివ్ గా టి‌ఆర్‌ఎస్ పై విమర్శలు గుప్పించడంలో సంజయ్ ది ప్రత్యేకశైలి. గ్రేటర్ హైదరబాద్ ఎన్నికల సమయంలో బండి చేసిన ప్రచారం ఏ స్థాయిలో చర్చనీయాంశం అయిందో అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంచితే ప్రస్తుతం బండి సంజయ్ పై బీజేపీ హైకమాండ్ వేటు వేయనుందా అనే చర్చ జోరుగా జరుగుతోంది. ఎందుకంటే తాజాగా ఈటెల రాజేందర్ మరియు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి లకు డిల్లీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. గత కొన్నాళ్లుగా ఈటెలకు భీజెపి పార్టీలో సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన పార్టీ మారే అవకాశం ఉందని వార్తలు గట్టిగానే వినిపించాయి.

అయితే ఆ వార్తలలో ఎలాంటి నిజం లేదని ఈటెల స్పష్టం చేసినప్పటికీ రూమర్స్ మాత్రం ఆగడం లేదు. దాంతో ప్రస్తుతం చేరికల కమిటీ చైర్మెన్ గా ఉన్న ఈటెల ను వచ్చే ఎన్నికల్లో సి‌ఎం అభ్యర్థిగా కే‌సి‌ఆర్ కు పోటీకగా నిలబెట్టేందుకు బీజేపీ హైకమాండ్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బండి సంజయ్ ని పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిస్తూ.. ఈటెలను సి‌ఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఎలా ఉంటుందనే దానిపై కూడా బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

కే‌సి‌ఆర్ మరియు ఈటెల కు గత కొంత కాలంగా విభేదాలు నడిచాయి. కే‌సి‌ఆర్ ఈటెల మీద కోపంతో పార్టీ నుంచి వెళ్లగొడితే.. అదే ఈటెలపై ప్రజల్లో సానుభూతి పెరిగి హుజూరాబాద్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. దాంతో కే‌సి‌ఆర్ కు పోటీగా ఈటెలను నిలబెడితే సానుభూతి వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందనేది బీజేపీ అధిష్టానంలో నడుస్తున్న చర్చనట. అందుకే ఉన్నపళంగా ఈటెల కు డిల్లీ నుంచి పిలుపు వచ్చిందని వినికిడి. మరి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోవడంతో తదుపరి కార్యాచరణకు దిశ నిర్దేశం చేయడానికి ఆయనకు కూడా పిలుపు వచ్చిందని పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ గా నడుస్తున్న చర్చ. మరి బీజేపీ హైకమాండ్ బండి సంజయ్ నే నమ్ముకుంటుందా లేదా ఈటెల వైపు చూస్తుందా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి

ఇదే చివరి ఎలక్షన్..నిజమేనా ? వ్యూహమా ?

కొత్త వారికి నో ఛాన్స్.. కే‌సి‌ఆర్ వ్యూహం ఫలిస్తుందా ?

తెలంగాణలో కూడా పవన్ పొత్తు ఉంటుందా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -