Monday, April 29, 2024
- Advertisement -

నాగ్, వెంకీ మూవీస్ కు బ్రేక్.. ఇవ్వబోతున్నారా ?

- Advertisement -

సీనియర్ హీరోలలో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ మాత్రమే అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా లైన్ లో పెడుతూ దూసుకుపోతున్నారు. ప్రజెంట్ చిరు వాల్తేరు వీరయ్య, బోళాశంకర్ మూవీస్ సెట్స్ పై ఉంటే బాలయ్య కూడా వీరసింహ రెడ్డి మూవీతో పాటు.. అనిల్ రావిపూడి మూవీని కూడా లైన్ లో పెట్టారు. మరి ఈ ఇద్దరు హీరోలు వరుస సినిమాలతో దూసుకుపోతుంటే.. మరో ఇద్దరు సీనియర్ హీరోలైన కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్ స్లో అండ్ స్టెడీ పాలసీలో వెళుతున్నారు. కింగ్ నాగార్జున ఈ ఏడాది బంగార్రాజు, ఘోస్ట్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. వీటిలో బంగార్రాజు పర్వాలేదనిపించిన, ఘోస్ట్ మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది.

ఇక బాలీవుడ్ మూవీ బ్రహ్మస్త్ర సినిమాలో కూడా గెస్ట్ రోల్ లో మెరిశాడు నాగ్. ఈ మూవీ కూడా తెలుగులో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక నాగార్జున ప్రస్తుతం ఏ మూవీస్ కు కూడా ఒకే చెప్పలేదు. సోగ్గాడే చిన్ని నాయన సినిమా తరువాత నాగ్ నటించిన ఏ మూవీ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో రీఫ్రెష్ కోసం నాగ్ మూవీస్ కి కొంత విరామం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పరిస్థితి కూడా దాదాపుగా ఇలాగే ఉంది. వెంకటేష్ సోలో హిట్ కొట్టి చాలా కాలమే అయింది.

వెంకటేష్ ఈ మద్య నటిస్తున్న అన్నీ సినిమాలు మల్టీ స్టారరే కావడం విశేషం. ఆ మద్య వచ్చిన ఎఫ్3 తో పాటు ఇటీవల గెస్ట్ రోల్ లో నటించిన ” ఓరి దేవుడా ” కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. ఇక ప్రస్తుతం రాణాతో కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్న వెంకీ.. సోలో గా ఏ మూవీస్ కి కూడా కమిట్ అవ్వలేదు. ఇక వెంకీ కూడా కొన్ని రోజులు మూవీస్ కి బ్రేక్ ఇవ్వబోతున్నాడని అందుకే కొత్త సినిమాకు కమిట్ అవ్వడం లేదనే వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి సీనియర్ హీరోలు వెంకీ, నాగార్జున ల చేతిలో ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా లేకపోవడంతో.. వీరిద్దరి బ్రేక్ గ్యారెంటీ అనే వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్.. హీరోలు ఎవరో తెలిసా ?

చిరు బాలయ్యకు స్ట్రోక్ ఇస్తోన్న తలపతి విజయ్ ?

మహేశ్ మొత్తం కథ మార్చేస్తున్నాడా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -