చిరుకు సమ్మర్ లో కూడా తప్పని పోటీ..!

Box Office Clash Chiranjeevi Bhola Shankar and Rajinikanth Jailer in Summer
Box Office Clash Chiranjeevi Bhola Shankar and Rajinikanth Jailer in Summer

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “వాల్తేరు వీరయ్య” అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. బాబీ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పక్క ఊర మాస్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ తరువాత ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న భోలా శంకర్ మూవీని కూడా ఆ వెంటనే సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు చిరు ప్లాన్ చేస్తున్నాడట. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ఏప్రెల్ 16 విడుదల చేసేందుకు భోళా శంకర్ చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక మూవీకి ఒకప్పటి స్టైలిష్ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. .

తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచిన అజిత్ మూవీ ” వేదాలం ” కు రీమేక్ గా రూపొందుతోంది ఈ మూవీ. ఎప్పుడో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పటికి రిలీజ్ విషయంలో మాత్రం జాప్యం జరుగుతూనే ఉంది. వాల్తేరు వీరయ్య కంటే ముందే భోళా శంకర్ సెట్స్ పైకి వెళ్ళినప్పటికి.. వాల్తేరు వీరయ్య మూవీనే మొదట రిలీజ్ చేస్తున్నారు చిరు. ఇక ప్రస్తుతం వాల్తేరు వీరయ్య మూవీకి గట్టి పోటీ వాతావరణం నెలకొంది.

బాలయ్య ” వీరసింహరెడ్డి “, తలపతి విజయ్ ” వారసుడు ” సినిమాలు కూడా సంక్రాంతి రేస్ లో నిలవడంతో చిరు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఇక సమ్మర్ లో ” భోళా శంకర్ ” తో సోలోగా వద్దామనుకున్న చిరుకు.. సమ్మర్ లో కూడా పోటీ తప్పేలా లేదు. భోళాశంకర్ రిలీజ్ డేట్ పైన తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కన్నేశారు. తన కొత్త సినిమా జైలర్ ను ఏప్రెల్ 16నే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. దీంతో చిరు సమ్మర్ లో కూడా పోటీ ఎదుర్కోవాల్సి వస్తోంది. మరి మెగాస్టార్ బొళా శంకర్ విషయంలో రిలీజ్ డేట్ పై పునఃఆలోచిస్తారా లేదా తన మిత్రుడు సూపర్ స్టార్ రజినితో పోటీకి సై అంటారా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి

“ప్రాజెక్ట్ కే” మామూలుగా ఉండదట!

ఆదిత్య 999 ఎప్పుడంటే..క్లారిటీ ఇచ్చిన బాలయ్య!

హీరోలను విలన్లుగా మారుస్తున్న స్టార్ డైరెక్టర్ !