Tuesday, April 30, 2024
- Advertisement -

చంద్రబాబు ఒంటరి పోరు సాధ్యమేనా?

- Advertisement -

రాజకీయాల్లో అపార చాణక్యుడిగా పేరు గాంచిన చంద్రబాబుకు గత ఎన్నికల్లో ఎదురైన పరాభవం అంతా ఇంతా కాదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత కనీవినీ ఎరుగని రీతిలో ఘోర ఓటమి చవిచూసింది. అయితే చంద్రబాబుకు ఓటమి కొత్తేమీ కాదు. గతంలో కూడా ఓటమిల భారీ నుంచి మళ్ళీ గెలుపు బాటలో ప్రయాణించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఆయన ఎన్నికల సమయంలో వేసే వ్యూహాలు, ప్రణాళికల దెబ్బకు ప్రత్యర్థులు చిత్తుకావాల్సిందే. కానీ గత ఎన్నికల్లో బాబు వ్యూహాలు జగన్ గెలుపును నిలువరించలేకపోయాయి. కాగా ఎన్నికలోచ్చిన ప్రతి సారి పొత్తులతో బరిలోకి దిగే చంద్రబాబుపై ఏ పొత్తు లేకుండా జగన్ గత ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.

దాంతో అపర చాణక్యుడిగా, దేశ రాజకీయాలను ప్రభావితం చేసే నేతగా గుర్తింపు పొందిన బాబు, ఒంటరిగా బరిలోకి దిగేందుకు వెనకడుగు వేస్తున్నారనే విమర్శలు గట్టిగానే వినిపిస్తూ వస్తున్నాయి. కానీ ఈసారి మాత్రం ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే టీడీపీకి ఒంటరి పోరు తప్పదా అనే అనుమానం రాకమానదు. 2014 ఎన్నికల్లో బీజేపీ జెనసేనతో, అలాగే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తో జట్టు కట్టారు బాబు. ఆ తరువాత బీజేపీతో విభేదించి కూటమి నుంచి బయటకు వచ్చారు. అటు కాంగ్రెస్ తో పొత్తు కొనసాగించే పరిస్థితి లేదు. దాంతో రాబోయే 2024 ఎన్నికల్లో బాబు స్టాండ్ ఏంటన్నది ఇప్పటికీ కూడా ప్రశ్నార్థకమే.

జనసేనతో పొత్తుకు సిద్దంగా ఉన్నప్పటికి.. పవన్ నుంచి స్పష్టమైన సంకేతాలు రావడం లేదు. ఎందుకంటే జనసేన ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉంది. కానీ బీజేపీ మాత్రం టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని తేల్చిచెబుతోంది. దాంతో ప్రస్తుతం టీడీపీ ఎంటరిగానే మిగిలింది. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతామని, ఎవరితోనూ పొత్తు ఉండబోదని జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. దాంతో జగన్ దారిలోనే బాబు కూడా ఇకపై పొత్తులకోసం పాకులాడకుండా ఒంటరిగానే బరిలోకి దిగాలని చూస్తున్నాడట. అయితే బాబు ఒంటరిగా గెలిచి నిలిచేనా అంటే సమాధానం చెప్పడం కష్టమే. ఇప్పటివరకు జట్టులేకుండా బరిలోకి దిగని బాబుకు వచ్చే.. ఎన్నికల్లో మాత్రం ఒంటరిపోరు తప్పేలా లేదు.

ఇవి కూడా చదవండి

కర్నూల్ టూర్ బాబుకు నష్టం చేసిందా? లాభం చేకుర్చిందా?

అదే జరిగితే టీడీపీకి కోలుకోలేని దేబ్బే?

వైసీపీకి భవిష్యత్ ప్రత్యర్థి బీజేపేనట..మరి జనసేన?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -