Monday, April 29, 2024
- Advertisement -

మర్రి విషయంలో ఇలా.. కోమటిరెడ్డి విషయంలో అలా!

- Advertisement -

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకూ మరింత క్షిణిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో రెండవ స్థానంలో నిలిచిన హస్తం పార్టీ.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆస్థానాన్ని నిలుపుకోవడం కష్టమే అనే భావన కలుగక మానదు. ఓ వైపు బీజేపీ బలం పెంచుకోవడం. మరో వైపు పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు ఇలా పార్టీ ని అధోగతిలోకి నేడుతున్నాయి. ఇక కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న మునుగోడులో ఇటీవల డిపాజిట్ కూడా దక్కించుకోలేని పరిస్థితి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు హస్తం పార్టీ ఏ స్థాయిలో బలహీన పడిందనే విషయం. ఇక పార్టీ బలహీన బడుతుండడంతో పార్టీలోని నేతలు ఇతర పార్టీల పక్షాన చేరుతున్నారు..

ఆ మద్య దాసోజు శ్రవణ్, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారు పార్టీ వీడి బీజేపీ గూటికి చేరుకోగా.. ప్రస్తుతం పార్టీ మరో సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ కు బైబై చెప్పబోతున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ విడబోతున్నట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ మద్య అమిత్ షా తో బేటీ కావడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. ఇక తాజాగా పార్టీకి వీడ్కోలు చెబుతున్నట్లు స్పష్టం చేశారు. అయితే క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాంగ్రెస్ కు క్యాన్సర్ సోకిందని అది ప్రస్తుతం తగ్గే సూచన లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతే కాకుండా తాను పార్టీ వీడడానికి కారణం రేవంత్ రెడ్డి నాయకత్వమే అంటూ చెప్పుకొచ్చారు.

అయితే హస్తం పార్టీకి బైబై చెబుతున్నా ప్రతిఒక్క నేత రేవంత్ రెడ్డిపైనే ఆరోపణలు చేయడం గమనార్హం. ఇక కాంగ్రెస్ కు క్యాన్సర్ సోకిందని వ్యాఖ్యానించిన మర్రి శశిధర్ రెడ్డిపై టీకాంగ్రెస్ వేటు వేసింది. ఆరేళ్లపాటు పార్టీ నుంచి భహిష్కరించింది. అయితే ఆయన పార్టీ వీడే ఆలోచనతోనే అలాంటి హాట్ కామెంట్స్ చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే మునుగోడు బైపోల్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గెలవదని స్టేట్మెంట్ ఇచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై మాత్రం షోకజ్ నోటీసులు తప్పా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాగా కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై అడపాదడపా పరోక్ష విమర్శలు చేస్తూనే ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. అయినప్పటికి ఆయనపై ఎలాంటి చర్యలకు పాల్పడలేదు. కానీ మర్రి శశిధర్ రెడ్డిపై మాత్రం వేటు వేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిని బట్టి రాజకీయ సమీకరణలు మారుతుంటాయనేది మరోసారి నిరూపితం అయిందంటూ పోలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి

కర్నూల్ టూర్ లో బాబుకు ఓరిగిందేంటి ?

బండి సంజయ్ షాక్ తప్పదా..హైకమాండ్ చూపు ఎవరివైపు?

కొత్త వారికి నో ఛాన్స్.. కే‌సి‌ఆర్ వ్యూహం ఫలిస్తుందా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -