చిరు, బాలయ్య తో భారీ మల్టీ స్టారర్.. బడా ప్రొడ్యూసర్ క్లారిటీ !

Pan World Movie :A Huge Multi-Starrer With Chiranjeevi and Balakrishna
Pan World Movie :A Huge Multi-Starrer With Chiranjeevi and Balakrishna

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి నటసింహ నందమూరి బాలకృష్ణ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ లో ఈ ఇద్దరి హీరోలకు ఉండే ఫాలోయింగ్ మరే ఇతర హీరోలకు ఉండదనే చెప్పాలి. ఇక ఈ ఇద్దరి నుంచి సినిమాలు వస్తున్నాయంటే వీరి అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అని ఓ రేంజ్ లో బీభత్సం చేస్తుంటారు వీరి అభిమానులు.

ఇంతటి టాఫ్ కాంపిటేషన్ ఉన్న ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తే.. ఆ ఉహే వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది కదూ..! తాజాగా చిరు బాలయ్య మల్టీస్టారర్ గురించి టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆహా ఓటిటీ ఫ్లాట్ ఫామ్ లో బాలయ్య నిర్వహిస్తున్న ” ఆన్ స్టాపబుల్ సీజన్ 2 ” అయిదవ ఎపిసోడ్ కు గెస్టులుగా ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు, దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు, మరియు అల్లు అరవింద్ హాజరయ్యారు. .

ఇక ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో చిరు బాలయ్య మల్టీ స్టారర్ గురించి ప్రస్తావించారు నిర్మాత అల్లు అరవింద్. తాను అందరి నిర్మాతలతో పని చేశానని, కానీ మన కాంబినేషన్ పడలేదని బాలయ్య అల్లు అరవింద్ ను అడుగగా.. అందుకు అల్లు అరవింద్ బదులిస్తూ.. నేను మీతో చిరంజీవితో కలిపి ఓ భారీ మల్టీస్టారర్ చేయాలని చూస్తున్నానని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. దానికి బాలయ్య బదులిస్తూ.. ఈ ప్రాజెక్ట్ ఒకే అయితే పాన్ వరల్డ్ మూవీ అవుతుంది అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో చిరు బాలయ్య మల్టీస్టారర్ గురించిన చర్చ ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా నడుస్తోంది. ఒకవేళ నిజంగానే ఈ ఇద్దరి టాప్ హీరోలతో మల్టీ స్టారర్ ఒకే అయితే ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా నిలిచే అవకాశం ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ కాంబినేషన్ నిజంగానే సెట్ అవుతుందా లేదా కేవలం మాటల వరకే మిగిలిపోతుందా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి

ఆదిపురుష్ కష్టాలు.. వచ్చే ఏడాది కూడా డౌటే !

లోకేశ్ కోసం తెలుగు హీరోలు వెయిటింగ్!

హర్రర్ మూవీలో ప్రభాస్.. ఓన్లీ తెలుగులోనే!