అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చిన పవన్ !

Pawan Kalyan Next Movie With Director Sujeeth
Pawan Kalyan Next Movie With Director Sujeeth

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అటు మూవీస్ ను, ఇటు పాలిటిక్స్ ను రెండిటినీ సమపాళ్లలో మెన్ టైన్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. నిన్న మొన్నటి వరకు పాలిటిక్స్ లో ఫుల్ బిజీగా గడిపిన పవన్ మళ్ళీ బ్యాక్ టూ షూటింగ్ అంటున్నారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న హరి హర విరమల్లు మూవీని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీ అల్మోస్ట్ చివరి దశకు వచ్చిందట. ఇదిలా ఉంచితే ఆ వెంటనే మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు పవన్. సాహో దర్శకుడు సుజిత్ డైరెక్షన్ లో ఓ మూవీ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ మూవిని డీవీవీ దానయ్య నిర్మించబోతున్నారు. .

అతి త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ రీమేక్ మూవీనా లేదా స్ట్రైట్ మూవీనా అనే దానిపై క్లారిటీ లేదు. మొత్తానికి ఎవరు ఊహించని కాంబినేషన్ సెట్ కావడంతో ఈ ప్రాజెక్ట్ పై అభిమానుల్లో క్యూరియాసిటీ నెలకొంది. ఇక సాహో లో భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు ప్రభాస్ ను స్టైలిష్ లుక్ లో చూపించిన సుజిత్ పవర్ స్టార్ ను ఎలా ప్రజెంట్ చేస్తాడో చూడాలి. ఇక ఈ ప్రాజెక్ట్ తో పాటు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంటూ వస్తున్న ” భవధియుడు భగత్ సింగ్ ” మూవీని కూడా సుజిత్ మూవీతో పాటు ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడట పవన్. అయితే ఆ మద్య సురేందర్ రెడ్డి తో కూడా ఓ మూవీ ఉండబోతుందని ప్రకటించిన పవన్.. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టి సుజిత్ సినిమాను లైన్ లోకి తీసుకొచ్చాడు. మొత్తానికి. పాలిటిక్స్ లో బిజీగా గడిపే పవన్ మళ్ళీ వరుసగా మూవీస్ పై దృష్టి పెట్టడంతో పవర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

కే‌జి‌ఎఫ్ ను ఫాలో అవుతున్న సలార్ !

ఆచార్య తెచ్చిన తిప్పలు.. పాపం కొరటాల పరిస్థితి ?

చరణ్ బుచ్చిబాబు మూవీ స్టోరీ ఇదేనా ?