Sunday, April 28, 2024
- Advertisement -

సీమ గర్జనతో వైసీపీకి ఒరిగిందేంటి ?

- Advertisement -

వికేంద్రీకరణకు మద్దతుగా సోమవారం ( నేడు ) కర్నూల్ జిల్లా ఎస్టీబిసి గ్రాండ్ లో ” సీమ గర్జన ” పేరుతో వైసీపీ నేతలు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కర్నూల్ ను న్యాయ రాజధానిగా ఏర్పాటు చేసేందుకు ప్రజా మద్దతు కావాలని, గత కొన్ని రోజులుగా సీమగర్జన నిర్వహించేందుకు నానా హడావిడి చేసిన వైసీపీ నేతలు ఎట్టకేలకు సీమ జేఏసీ ఆద్వర్యంలో నేడు గర్జన ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక, కార్మిక, దేవదాయ, శాఖల మంత్రులతో పాటు వైసీపీ, ఎమ్మేల్యేలు, ఎంపీలు ఇతర వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ గర్జనలో పాల్గొన్న వైసీపీ నేతలు సీమ ప్రజలను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు..

ఆంధ్ర ప్రదేశ్ తొలి రాజధానిగా కర్నూల్ ఉందని, ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు కర్నూల్ లో ఎలాంటి అభివృద్ది జరగలేదని, అన్నీ రంగాల్లోనూ కర్నూల్ వెనుకబడిందని మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ వ్యాఖ్యానించారు. అందుకే జగన్మోహన్ రెడ్డి రాయలసీమను అభివృద్ది పథంలో నడిపేందుకే కర్నూల్ లో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని సంకల్పించినట్లు బుగ్గన చెప్పుకొచ్చారు. ఎన్ని అడ్డంకులు ఎదురైన పరిపాలన వికేంద్రీకరణ దిశగానే జగన్ అడుగులు ఉంటాయని బుగ్గన అన్నారు. రాయలసీమలో న్యాయరాజధాని ఏర్పాటు చేసేందుకు ప్రజా మద్దతు కావాలని వైసీపీ నేతలు కోరారు.

అయితే ఈ గర్జనలో వైసీపీ నేతలు ఎక్కువ శాతం ప్రతిపక్ష నేత చంద్రబాబు పై విమర్శలు చేసేందుకే సమయాన్ని కేటాయించారు. కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటుకు చంద్రబాబు అనుకూలమో వ్యతిరేకమో చెప్పాలని డిమాండ్ చేశారు. రాయలసీమ అభివృద్ది చెందకపోవడానికి చంద్రబాబే కారణం అంటూ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో రాయలసీమలో టీడీపీ మరింత పతనం అవ్వడం కాయమంటూ వ్యాఖ్యానించారు. కాగా ఒక అధికార పార్టీ ఏర్పాటు చేసిన సభలో పదే పదే ప్రతిపక్ష నేత గురించి ప్రస్తావించడం ఏంటి అనే ప్రశ్నలు వస్తున్నాయి. అసలు వైసీపీ నేతలు గర్జన సభను నిర్వహించింది కేవలం చంద్రాబాబునే విమర్శించడానికేనా అన్న సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు రాజకీయవాదులు.

అధికారంలో ఉన్న పార్టీ నేతలు.. న్యాయ రాజధానిగా కర్నూల్ ఉండేందుకు మద్దతు తెలపాలని ప్రతిపక్ష నేత చంద్రబాబును కోరడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే.. అసలు ఇది సీమగర్జన కాదని.. చంద్రాబాబు పై గర్జన అంటూ సామన్యులు సెటైర్లు వేస్తున్నారు. అసలు ప్రభుత్వంలో ఉన్న పార్టీ గర్జన సభలు నిర్వహించడమే విడ్డూరం అనుకుంటే.. ఆ సభలలో ప్రతిపక్ష నేతను పదే పదే ప్రతిపక్ష నేతను ప్రస్తావించడం మరింత విడ్డూరం. సాధారణంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఇలాంటి సభలను నిర్వహిస్తుంటాయి. కానీ ఏపీలో మాత్రం ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ప్రభుత్వం సభలు నిర్వహిస్తోంది. మరి మొత్తానికి సీమగర్జనతో వైసీపీకి ఒరిగిందేంటో ఆ పార్టీ నేతలకే తెలియాలని కొందరు రాజకీయ వాదులు వ్యంగ్యస్త్రాలు సందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పవన్ కోసం బాబు కాంప్రమైజ్ కావాల్సిందే..!

కే‌సి‌ఆర్ కు ఈసారి ఎన్నికలు కత్తి మీద సామే !

పవన్ యాక్టర్ గా సక్సస్.. పొలిటీషియన్ గా ఫెయిల్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -