Saturday, May 4, 2024
- Advertisement -

చరణ్ బుచ్చిబాబు మూవీ స్టోరీ ఇదేనా ?

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో ఓ మూవీ రాబోతున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లబోతుంది అనే దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కాగా ఈ మూవీ RC16 నా లేక RC17న అనే దానిపై కూడా క్లారిటీ లేదు. కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం శంకర్ మూవీ తరువాత బుచ్చిబాబు మూవీనే సెట్స్ పైకి తెసుకెల్లే ఆలోచనలో చరణ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఉప్పెన తరువాత ఎన్టీఆర్ తో మూవీ చెంసేందుకు బుచ్చిబాబు దాదాపు రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్నాడు. కానీ ఎన్టీఆర్ ముందు ఒప్పుకున్న సినిమాలు ఉండడంతో బుచ్చిబాబును పక్కన పెట్టేశాడు. కానీ చరణ్ తో మూవీని రిఫర్ చేసింది ఎన్టీఆర్ అనే వార్తలు కూడా వస్తున్నాయి. .

దాంతో ఎన్టీఆర్ కు చెప్పిన స్టోరినే చరణ్ కు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ తో బుచ్చిబాబు ఓ స్పొర్ట్స్ డ్రామాతో స్క్రిప్ట్ సిద్దం చేశాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. మూవీ స్క్రిప్ట్ అంతా ఫుడ్ బాల్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుందని, ఎన్టీఆర్ ఫుడ్ బాల్ కోచ్ గా నటిస్తాడని జోరుగా పుకార్లు షికారు చేయాయి. అయితే ఆ స్టోరీని చరణ్ బాడీ లాంగ్వేజ్ కు సూట్ అయ్యే విధంగా బుచ్చిబాబు కొంత మార్పులు చేశాడట. దాంతో మార్చిన స్టోరీ పరంగా చరణ్ ను ఫుడ్ బాల్ ప్లేయర్ గా చూపించబోతున్నాడట బుచ్చిబాబు. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవముందో తెలియదు గాని ప్రస్తుతం బుచ్చిబాబు చరణ్ మూవీలా స్టోరీ ఇదే నంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. మరి గతంలో ఎన్నో రోజులుగా స్పొర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మూవీ చేయాలని ఆశించిన చరణ్ కు స్పొర్ట్స్ మూవీ స్క్రిప్ట్ తీసుకురావడంతో బుచ్చిబాబు మూవీకి చరణ్ ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఎలాంటి మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

చిరును వెనక్కి నెట్టిన బాలయ్య!

దిల్ రాజు కు చుక్కలు చూపిస్తున్న విజయ్!

సమ్మర్ హీట్ పెంచుతోన్న స్టార్ హీరోలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -