Sunday, April 28, 2024
- Advertisement -

రైతులు నిజంగానే కాలర్ ఎగరేస్తున్నారా.. కే‌సి‌ఆర్ సార్ !

- Advertisement -

తెలంగాణలో మొదటి నుంచి కూడా రైతులపై ప్రత్యేక దృష్టి పెడుతూ వచ్చింది కే‌సి‌ఆర్ సర్కార్. ప్రత్యేకంగా రైతుల కోసం రైతు బందు, ఉచిత కరెంట్ వంటి పథకాలు అమలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తోంది. ఇది ప్రభుత్వం తరుపు నుంచి వినిపిస్తున్న మాట. అయితే ఈ పథకాలు ఎంతవరకు పారదర్శికంగా అమలౌతున్నాయి అంటే చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా రైతు బందుకు సంబంధించిన నిదులు సకాలంలో విడుదల చేయడం లేదనే విమర్శలు కే‌సి‌ఆర్ సర్కార్ పై గట్టిగానే వినిపించాయి. అంతే కాకుండా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం పెడుతున్న కండిషన్స్ కూడా రైతుల్లో అసహనానికి మరో కారణం. ఇదిలా ఉంచితే రైతు బంధు పథకం అమలులో కూడా ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని, అర్హులైన రైతులకు ఆ పథకం చేరడం లేదని కొందరు రైతులు వాపోతున్న పరిస్థితి.

ఇదిలా ఉండగా తమ పాలనలో రైతులు కాలర్ ఎగరేస్తున్నారని సి‌ఎం కే‌సి‌ఆర్ వ్యాఖ్యానించడం నిజంగా ఆశ్చర్యం కలిగిమే విషయమేనని ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు లో నిర్వహించిన సభలో కే‌సి‌ఆర్ చాలా వాటిపై తనదైన రీతిలో మాట్లాడారు. తెలంగాణలో ప్రస్తుతం కరెంట్, మంచినీటికి ఏమాత్రం కొరత లేదని, ఇవాళ రైతు ఏ కారణంతో చనిపోయిన వెంటనే రూ. 5 లక్షల రూపాయలు ఇస్తున్నామని కే‌సి‌ఆర్ వ్యాఖ్యానించారు. మన పాలనలో రైతు కాలర్ ఎగరేసుకునే స్థితికి చేరుకోవాలని కే‌సి‌ఆర్ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా రాష్ట్రనికి పెద్ద సంఖ్యలో పరిశ్రమలు వస్తున్నాయని, ఇది నిజంగా గర్వకారణమైన విషయం అని కే‌సి‌ఆర్ చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నా అభివృద్ది చూసి మహారాష్ట్ర, కర్నాటక, సరిహద్దు ప్రాంతాల ప్రజలు కూడా తెలంగాణలో కలపాలని కోరుతున్నారంటూ వ్యాఖ్యానించారు కే‌సి‌ఆర్. ఇక అభివృద్ది అనేది కేవలం మతలతోనో, లేదా డైలాగులతోనో సాధ్యం కాదని, అభివృద్ది చేసి చూపించడమే తమ లక్ష్యం అంటూ కే‌సి‌ఆర్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

పవన్ యాక్టర్ గా సక్సస్.. పొలిటీషియన్ గా ఫెయిల్ !

పవన్ కోసం బాబు కాంప్రమైజ్ కావాల్సిందే..!

ఆంధ్ర మంత్రికి తెలంగాణ మంత్రికి తేడా అదే !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -