ప్రభాస్ ను బాలయ్య ఇరకాటంలో పెడతాడా ?

Balakrishna Questions To Prabhas About Wedding in Unstoppable
Balakrishna Questions To Prabhas About Wedding in Unstoppable

నటసింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ” ఆన్ స్టాపబుల్ ” ఏ స్థాయిలో దూసుకెళ్లిందో తెలిసిందే. అసలు బాలయ్యలోని సరికొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ షో. వచ్చిన గెస్ట్ లతో బాలయ్య చేసే అల్లరి, సరదా సంబాషణలు, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినే అందించాయి. ఇక ఇప్పటి జనరేషన్ లో కూడా బాలయ్య ఇమేజ్ ను ” ఆన్ స్టాపబుల్ ” షో డబుల్ చెప్పాలి. ఇక ” ఆన్ స్టాపబుల్ ” టాక్ షో ను కంటిన్యూ చేస్తూ సిజన్ 2 కూడా అంతే స్థాయిలో దూసుకుపోతుంది. ఈ సిజన్ 2 లో సెలబ్రేటీలతో పాటు పొలిటీషియన్స్ తో కూడా ఇంటర్వ్యూ చేస్తూ సరికొత్త వినోదాన్ని పంచుతున్నారు బాలయ్య.. ఇదిలా ఉంచితే బాలయ్య టాక్ షో కు నేషనల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ గా రానున్నాడు..

ఇక ఇప్పటికీ ఆ ఎపిషోడ్ కు సంబంధించిన చిన్న గ్లిమ్స్ కూడా విడుదల అయింది. అయితే అందరినీ ఆట పట్టిస్తూ చలాకీ ప్రశ్నలతో ఇరకాటంలో పెట్టే బాలయ్య నేషనల్ స్టార్ ప్రభాస్ తో ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారనేదే ఇప్పుడు అందరిలోని క్యూరియాసిటీ పెంచుతోంది. అయితే నలబై ఏళ్ళు పైబడిన ప్రభాస్ ఇంతవరకు పెళ్లి చేసుకోకపోవడంపై తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు డార్లింగ్. అలాగే పెళ్లి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ప్రభాస్ ఆన్సర్ చెప్పకుండా దాటవేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ పెళ్లి విషయాన్ని బాలయ్య కచ్చితంగా ప్రస్తావనకు తెచ్చే అవకాశం ఉంది. మరి పెళ్లిపై ప్రభాస్ బాలయ్య షో లో నిజం చెబుతాడా లేదా మళ్ళీ పెళ్లి ప్రస్తావనను దాటవేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే బాలయ్య కన్వర్జేషన్ చాలా ఫ్రెండ్లీ గా ఉంటుంది కాబట్టి ప్రభాస్ పెళ్లిపై తన మనసులోని మాట బయటపెట్టే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి బాలయ్య టాక్ షో కు ప్రభాస్ రావడంతో అందరి చూపు ఈ ఎపిసోడ్ పై పడింది. ఇక ఈ ఎపిసోడ్ 31 ఫస్ట్ స్పెషల్ గా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

ఇవి కూడా చదవండి

విక్రమ్ ” రోలెక్స్ ” ఫుల్ మూవీ.. పూనకాలే !

పుష్ప 2.. సుక్కు నయా ప్లాన్ ?

తలపతి విజయ్ కి అండగా పవన్ ?