Sunday, April 28, 2024
- Advertisement -

కే‌సి‌ఆర్ జగన్ దోస్తీ.. ఇదే అసలు వ్యూహమా ?

- Advertisement -

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బి‌ఆర్‌ఎస్ కు సంబంధించిన చర్చే జరుగుతోంది. కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కే‌సి‌ఆర్.. బి‌ఆర్‌ఎస్ ను దేశ వ్యాప్తంగా విస్తరించే పనిలో నిమగ్నమై ఉన్నారు. అందులో భాగంగానే ఏపీలో కూడా బి‌ఆర్‌ఎస్ ఎంట్రీ ఎవ్వనుంది. ఈ నేపథ్యంలో బి‌ఆర్‌ఎస్ రాక వల్ల ఏపీలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకొనున్నాయి అనే దానిపై హాట్ హాట్ డిబేట్లు నడుస్తున్నాయి. అయితే రాబోయే సార్వత్రిక ఎన్నికలే టార్గెట్ గా బి‌ఆర్‌ఎస్ సిద్దమౌతోంది. ఈ నేపథ్యంలో బి‌ఆర్‌ఎస్ కేవలం లోక్ సభ ఎన్నికలే టార్గెట్ గా ముందుకు కదులుతుందా ? లేదా ఆయా రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల బరిలో కూడా నిలుస్తుందా ? అంటే కచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల బరిలో కూడా నిలిచే అవకాశం ఉంది.

జాతీయ పార్టీ హోదా దక్కాలంటే కనీసం నాలుగు రాష్ట్రాలలోనైనా ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాల్సిన అవసరం ఉంది. ఈ లెక్కన చూస్తే.. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో కూడా బి‌ఆర్‌ఎస్ నిలిచే అవకాశం ఉంది. అయితే బి‌ఆర్‌ఎస్ సింగిల్ గా బరిలోకి దిగుతుందా ? లేదా ఏపీలోని ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందా అనే దానిపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. అయితే ఏపీలో ప్రస్తుత పరిస్థితులు చూస్తే బి‌ఆర్‌ఎస్ తో కలిస్తే పార్టీ ఏదైనా ఉందా ? అది ఒక్క వైసీపీనే. ఎందుకంటే టీడీపీ తో కే‌సి‌ఆర్ కలిసే అవకాశం లేదు. ఇక జనసేన ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉంది. ఇక బీజేపీనే ప్రధాన శత్రువు గా భావిస్తున్న కే‌సి‌ఆర్ ఆ పార్టీతో కలిసే ప్రసక్తే లేదు. అందువల్ల కే‌సి‌ఆర్‌ కు ఉన్న ఒకే ఒక ఆప్షన్ వైసీపీ మాత్రమే.

అయితే తాము వచ్చే ఎన్నికల్లో కూడా సింగిల్ గానే బరిలోకి దిగుతామని, ఏ పార్టీతో పొత్తు ఉండబోదని జగన్ ఆ మద్య చెప్పుకొచ్చారు. కానీ ఇటీవల బి‌ఆర్‌ఎస్ విషయంలో స్పందించిన వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి.. ” ఏపీలో బి‌ఆర్‌ఎస్ పెట్టడం మంచిదేనని, ఏ పార్టీ ఎక్కడినుంచైనా పోటీ చేయచ్చని చెప్పుకొచ్చారు.. అంతే కాకుండా బి‌ఆర్‌ఎస్ తో భవిష్యత్ లో పొత్తు ఉంటుందా ఉండదా ? అనేది పార్టీలో అధినేత డిసైడ్ చేశాడని.. పార్టీ నేతలంతా చర్చించిన తరువాతే బి‌ఆర్‌ఎస్ తో కలవాలా ? లేదా ? అనేదానిపై నిర్ణయం తీసుకుంటామని సజ్జల ఆ మద్య చెప్పుకొచ్చారు. ఇక బి‌ఆర్‌ఎస్ నేతలు కూడా ఇతర పార్టీలతో కలిసి నడిచేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతున్నారు. వైఎస్ జగన్ మరియు కే‌సి‌ఆర్‌ మద్య మంచి అనుబంధమే ఉంది. దీంతో బి‌ఆర్‌ఎస్ మరియు వైసీపీ కలిసిన ఆశ్చర్యం లేదనే వాదన పోలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. మరి భవిష్యత్ లో ఏం జరుగుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

వన్స్ మోర్ జగన్.. 2024 ?

బి‌ఆర్‌ఎస్ వైరస్ లాంటిదా ?

టార్గెట్ సి‌ఎం పదవి.. బీజేపీ ఓపెన్ ఆఫర్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -