Thursday, May 2, 2024
- Advertisement -

తెలుగువాళ్ళంటే.. ఎందుకంత చిన్న చూపు !

- Advertisement -

ప్రస్తుతం అధికారంలో ఉన్న మోడీ సర్కార్ కు నార్త్ రాష్ట్రాలపై ఉన్న ప్రేమ సౌత్ రాష్ట్రాలపై లేదనేది మొదటి నుంచి వినిపిస్తున్న విమర్శ. ఎందుకంటే బీజేపీ ప్రభావం నార్త్ రాష్ట్రాలతో పోలిస్తే సౌత్ రాష్ట్రాలలో చాలా తక్కువ. ఒక విధంగా చెప్పాలంటే.. జాతీయ పార్టీలకు సౌత్ రాష్ట్రాలలో స్థానం లేదనే చెప్పాలి. తమిళ్ నాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ.. ఇలా అన్నీ రాష్ట్రాలలో కూడా ప్రాంతీయ పార్టీలకే ప్రజలు అధిక ప్రదాన్యం ఇస్తున్నారు. ఎందుకంటే బాష ప్రతిపాధికన ప్రజలు ప్రాంతీయ పార్టీలకే ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. దాంతో జాతీయ పార్టీలను పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక సౌత్ రాష్ట్రాలలో విస్తరించాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నప్పటికి.. ఎప్పటికప్పుడు నిరాశే ఎదురౌతోంది. దీంతో కమలనాథులు నార్త్ రాష్ట్రాలపై చూపే ప్రేమ సౌత్ రాష్ట్రాలపై చూపరానే విమర్శలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. .

ఇక నిధుల కేటాయింపులో కూడా సౌత్ రాష్ట్రాలపై పక్షపాతంగానే వ్యవహరిస్తూ ఉంటుంది కేంద్రం. ఇదిలా ఉంచితే ఇటీవల పార్లమెంట్ లో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలతో కేంద్రానికి తెలుగువాళ్ళంటే ఎంత చిన్న చూపో మరోసారి రుజువైంది. వివరాల్లోకి వెళితే.. రూపాయి మారక విలువ పతనం అవ్వడాన్ని ప్రశ్నిస్తూ పార్లమెంట్ లో తెలంగాణ కాంగ్రెస్ ఏపీ రేవంత్ రెడ్డి హిందీలో ప్రశ్నలు సంధించారు. మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ రూపాయి విలువ రూ. 66 గా ఉండేదని, కానీ మోడీ ప్రధాని అయిన తరువాత డాలర్ విలువ పెరిగి.. రూపాయి మారకం తగ్గిందని విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి.

అయితే రేవంత్ రెడ్డి హిందీ అనర్గళంగా లేకపోవడంతో.. ఆయనకు కౌంటర్ గా ఆర్థిక శాఖమంత్రి నిర్మలాసీతా రామన్ మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి వచ్చినవారు.. వచ్చి రాని ..హిందీలో విమర్శలు గుప్పిస్తున్నారని, తాను కూడా వారికి వచ్చి రాని హిందీలోనే సమాధానం ఇస్తానని.. నిర్మలసీతారామన్ అనడంతో ఒక్కసారిగా ఆమె వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమౌతోంది. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తెలుగువాళ్లపై చిన్నచూపేందుకు అని నిర్మలసీతారామన్ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా పార్లమెంట్ లో సౌత్ వాళ్ళను ముఖ్యంగా తెలుగువాళ్ళను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం కమలనాథులకు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. మొత్తానికి నిర్మలసీతరామన్ మరియు రేవంత్ రెడ్డి మద్య పార్లమెంట్ లో చోటుచేసుకున్న కన్వర్జేషన్ తో తెలుగువాళ్ళంటే కేంద్ర ప్రభుత్వానికి ఎంత చిన్న చూపో అనే విషయం మరోసారి రుజువైందని రాజకీయ వాదులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

బి‌ఆర్‌ఎస్ తో వైసీపీ.. దోస్తీ !

బి‌ఆర్‌ఎస్ వైరస్ లాంటిదా ?

వాలెంటిర్లపై.. టీడీపీ ఫోకస్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -