వారసుడు మూవీ కోసం రంగంలోకి పవర్ స్టార్ ?

Pawan Kalyan To Attend Thalapathy Vijay’s Varasudu Pre-Release Event?
Pawan Kalyan To Attend Thalapathy Vijay’s Varasudu Pre-Release Event?

ఈ సంక్రాంతి సిజన్ లో టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన మెగాస్టార్ చిరంజీవి ” వాల్తేరు వీరయ్య “, నటసింహ నందమూరి బాలకృష్ణ ” వీరసింహారెడ్డి ” మూవీస్ తో బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు సినిమాలపైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మూవీస్ పరంగా చిరకాల ప్రత్యర్థులుగా మొదటి నుంచి కూడా ఈ ఇద్దరి మద్య రసవత్తరమైన పోరు కొనసాగుతూనే వస్తోంది. అలాంటి ఈ టాప్ స్టార్స్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే వీరిద్దరి అభిమానులు చేసే రచ్చ అంతా ఇంత కాదు. మరే ఈ ఇతర హీరో కూడా వీరిద్దరికి పోటీకి మూవీని రిలీజ్ చేసే దైర్యం చేయలేరు. .

అలాంటిది ఈ సంక్రాంతి సిజన్ కు మాత్రం వీరిద్దరికి పోటీగా తమిళ్ స్టార్ హీరో విజయ్ తలపతి తన ” వారసుడు ” మూవీతో రేస్ లో నిలిచాడు. ఈ మూవీని తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా, దిల్ రాజు ఈ మూవీని నిర్మించాడు. దాంతో ఈ సినిమాపైన తెలుగులో కూడా హైప్ క్రియేట్ అయింది. అయితే సంక్రాంతి సిజన్ లో కేవలం తెలుగు సినిమాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్మాతల మండలి తీర్మానించగా ” వారసుడు ” మూవీ పై వివాదం కొనసాగుతోంది. ఇదిలా ఉంచితే ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల చేయబోతున్నారు.

కాగా అదే రోజున నటసింహ నందమూరి బాలకృష్ణ కూడా ” వీరసింహ రెడ్డి ” తో రానున్నాడు. ఇక ఆ మరుసరి రోజే మెగాస్టార్ చిరంజీవి ” వాల్తేరు వీరయ్య ” మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ” వారసుడు ” పై హైప్ పెంచేందుకు నిర్మాత దిల్ రాజు అదిరిపోయే స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. వారసుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను చీఫ్ గెస్ట్ గా పిలిచేందుకు దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడట. దిల్ రాజు మరియు పవన్ మద్య మంచి బాండింగ్ ఉండడంతో పవన్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చే అవాకాశ ఉందనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే గనుక నిజం అయితే తమిళ్ సూపర్ స్టార్ విజయ్ తలపతి ని మరియు తెలుగు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను ఒకే స్టేజ్ పైన చూసే అవకాశం ఉంటుంది. దీంతో ” వారసుడు :” మూవీపై హైప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. మరి ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్న ఈ వార్తలు నిజం అవుతాయో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

వాల్తేరు వీరయ్య.. డిస్సపాయింట్ లో ఫ్యాన్స్ !

అక్కినేని హీరోలకు స్టార్ డమ్ వస్తుందా ?

విక్రమ్ ” రోలెక్స్ ” ఫుల్ మూవీ.. పూనకాలే !