జబర్దస్త్ రైటర్ కి నాగ్.. బంపర్ ఆఫర్ !

Nagarjuna Bumper Offer to Jabardasth Writer Prasanna Kumar
Nagarjuna Bumper Offer to Jabardasth Writer Prasanna Kumar

ఈ మద్య కాలంలో కింగ్ నాగార్జున సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంటున్నాయి. 2016లో వచ్చిన సోగ్గాడే చిన్నినయన సినిమా తరువాత నాగ్ నటించిన ఏ మూవీ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో నాగ్ పనైపోయిందనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక గత ఏడాది భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఘోస్ట్ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో నాగ్ కథల ఎంపికలో డైలమాలో పడ్డాడట. కాస్త సమయం తీసుకొని మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నాడట కింగ్ నాగార్జున. ఈ నేపథ్యంలో ఓ యువ రైటర్ ని దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. .

కెరియర్ మొదటి నుంచి కూడా ఎంతో మంది కొత్త డైరెక్టర్లను పరిచయం చేశారు నాగ్. అదే కోవలో ఇప్పుడు రైటర్ ప్రసన్న కుమర్ ను డైరెక్టర్ గా పరిచయం చేసేందుకు నాగ్ ప్రయత్నిస్తున్నారట. మొదట జబర్దస్త్ షో కు రైటర్ గా పని చేసిన ప్రసన్న కుమార్ ఆ తరువాత దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన సినిమా చూపిస్తా మామ, నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే, ధమాకా వంటి సినిమాలకు రైటర్ గా పని చేశారు. ఔట్ అండ్ ఔట్ కామిడీ స్క్రిప్ లు రాయడంలో సిద్దహస్తుడైన ప్రసన్న.. నాగ్ కోసం ఫుల్ కామిడీ కథ సిద్దం చేశారట. స్టోరీ కూడా నాగార్జునకు నచ్చడంతో ప్రసన్న బాబును దైరెక్టర్ గా పరిచయం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గాని ఫిల్మ్ సర్కిల్స్ లో మాత్రం తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి కెరియర్ మొదటి నుంచి ఎన్నో రిస్కులు చేసిన నాగార్జున.. రైటర్ ప్రసన్న కుమర్ ను దర్శకుడిగా మార్చే రిస్క్ చేస్తారేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

మెగాస్టార్ పూరీ కాంబినేషన్ ఫిక్స్..!

ప్రభాస్ ఖాతాలో మరో ఫ్లాప్ ?

వాల్తేరు వీరయ్య.. డిస్సపాయింట్ లో ఫ్యాన్స్ !