Sunday, April 28, 2024
- Advertisement -

వాల్తేరు వీరయ్య.. డిస్సపాయింట్ లో ఫ్యాన్స్ !

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి చాలరోజుల తరువాత వింటేజ్ మాస్ రోల్ లో నటిస్తున్న పక్కా కమర్షియల్ మూవీ ” వాల్తేరు వీరయ్య “. బాబీ కొల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల అయిన పోస్టర్స్, టైటిల్ టీజర్, ఫస్ట్ సింగిల్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీలో చిరుతో పాటు మాస్ మహారాజ్ రవితేజ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రవితేజ రోల్ కు సంబందించిన టీజర్ ను చిత్రాయునిట్ రిలీజ్ చేసింది. టీజర్ లో ఊర మాస్ ఎలిమెంట్స్ తో రవితేజ ఫుల్ ఎనర్జీటిక్ గా కనిపించారు. .

ఇక ఈ మూవీపై చిత్ర యూనిట్ పూనకాలు లోడింగ్ అంటూ ఎంత హైప్ క్రియేట్ చేసినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం కాస్త డిస్సపాయింట్ గా ఉన్నారట. ఎందుకంటే ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్ చూస్తే రొటీన్ మాస్ మసాలా చిత్రంగా కనిపిస్తోంది. ప్రస్తుతం తెలుగు ఆడియన్స్ రొటీన్ కు బిన్నంగా కొత్తదనం కోరుకుంటున్నారు. కథలో ఎంతో కొంత కొత్తదనం ఉంటేనే సినిమాను ఆధారిస్తున్నారు. కథలో ఏ మాత్రం కొత్తదనం లేకపోయిన ఎంతటి స్టార్ హీరో మూవీనైనా రిజక్ట్ చేస్తున్నారు తెలుగు ఆడియన్స్.

దాంతో వాల్తేరు వీరయ్య కూడా టీజర్స్ ను బట్టి చూస్తే రొటీన్ గా ఉండడంతో సినిమా రిజల్ట్ తేడా కొడుతుతుందా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఇక ఖైదీ నెంబర్ 150 తరువాత ఆ స్థాయి విజయం చిరుకు దక్కలేదు. చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన ” సైరా ” కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. ఇక ఈ ఏడాది వచ్చిన ఆచార్య డిజాస్టర్ కాగా, గాడ్ ఫాదర్ జస్ట్ యావరేజ్ గా నిలిచింది. దీంతో ” వాల్తేరు వీరయ్య ” తో చిరు కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్నాడు. మరి వాల్తేరు వీరయ్య చిరుకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

పుష్ప 2 లో రామ్ చరణ్.. పక్కా ?

మోక్షజ్ఞ కోసం బాలయ్య ఏం చేస్తున్నాడంటే..?

ఫ్యాన్స్ నుంచి పవన్ కు హెచ్చరికలు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -