Friday, May 3, 2024
- Advertisement -

ప్రభాస్ ఖాతాలో మరో ఫ్లాప్ ?

- Advertisement -

నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆదిపురుష్ మూవీకి కంప్లీట్ చేసిన ప్రభాస్.. ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కే.. షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. అయితే ఈ మద్యలో మరో సినిమాకు కూడా ప్రభాస్ కమిట్ అయిన సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్ ఓ హర్రర్ మూవీకి కమిటయ్యాడు ప్రభాస్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ తో తన కెరియర్ లోనే మొదటి సారి హర్రర్ బ్యాక్ డ్రాప్ లో మూవీ చేస్తున్నాడు ప్రభాస్. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ మొదలుకొని షూటింగ్ వరకు ఎలాంటి హడావిడి లేకుండా పట్టాలెక్కడంతో డార్లింగ్ ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యానికి లోనౌతున్నారు. .

ఇక ఈ క్రేజీ కాంబినేషన్ పై సినీ అభిమానుల్లో పెద్దగా అంచనాలు లేవనే చెప్పాలి. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ మూవీ లైట్ తీసుకుంటున్నట్లే తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం కోకపేటలో షూటింగ్ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆది కూడా మెగాస్టార్ చిరంజీవి డిజాస్టర్ మూవీ ” ఆచార్య ” షూటింగ్ జరిగిన చోటే. ఆచార్య మూవీ కోసం దర్మస్థలి పేరుతో కోకపేటలో ఓ భారీ సెట్ వేసిన సంగతి తెలిసిందే. మూవీలో దర్మస్థలి సెట్ కే మేజర్ ఇంపార్టెన్స్ ఉంటుంది. కాగా ఆ దర్మస్థలి సెట్ లోనే ఇప్పుడు ప్రభాస్ మారుతి మూవీ కూడా షూటింగ్ జరుపుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త డిస్సపాయింట్ గా ఫిల్ అవుతున్నారట. ఎందుకంటే ఆచార్య మూవీ మెగాస్టార్ కెరియర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. దాంతో అదే దర్మస్థలిలో షూటింగ్ జరుపుకుంటున్న ప్రభాస్ మూవీ కూడా ఫ్లాప్ అవుతుందా అనే భయం ప్రభాస్ ఫ్యాన్స్ ను వెంటాడుతుందట. మరి ఎలాంటి హైప్ లేని ప్రభాస్ మారుతి మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

వారసుడు మూవీ కోసం రంగంలోకి పవర్ స్టార్ ?

విక్రమ్ ” రోలెక్స్ ” ఫుల్ మూవీ.. పూనకాలే !

పుష్ప 2.. సుక్కు నయా ప్లాన్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -