Friday, May 17, 2024
- Advertisement -

తారకరత్నపరిస్థితి విషమం.. అసలేమైంది !

- Advertisement -

నారా లోకేశ్ యువగళం పేరుతో కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించగా.. ఈ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న హటాత్తుగా సొమ్మసిల్లి పడిపోవడంతో ఆయనను ప్రథమ చికిత్స కోసం హుటాహుటి న కేసి ఆసుపత్రికి తరలించారు. పాదయాత్ర ప్రారంభం అయ్యాక కుప్పం సమీపంలోని ఓ మసీదులో నిర్వహించిన ప్రార్థనలలో లోకేశ్ తో పాటు తారకరత్న కూడా పాల్గొన్నారు. అనంతరం మసీదు నుంచి బయటకు రాగానే టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా తరలి రావడంతో వారి తాకిడికి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయినట్లు తెలుస్తోంది. అయితే వైద్యులు చెబుతున్నా దాని ప్రకారం తారకరత్న కు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని ఆయన రక్త నాళాలలో బ్లాక్స్ ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. .

అంతే కాకుండా ఆయనను ఆసుపత్రికి తీసుకొచ్చే సమయంలో పల్స్ రేట్ పూర్తి పడిపోయిందని, శరీరం కూడా నీలంగా మారిపోయిందని వైద్యులు వెల్లడించారు. వెంటనే చికిత్స ప్రారంభించడంతో 45 నిముషాల తరువాత పల్స్ అందినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, మెరుగైన వైద్యం కోసం తారకరత్నను బెంగళూరు కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఇక తారకరత్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ ఆసుపత్రి కి వెళ్ళి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇక బాబాయ్ బాలకృష్ణకు పోన్ చేసి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై అరా తీశారు జూ. ఎన్టీఆర్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైద్యులకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఇలా హటాత్తుగా తారకరత్నకు గుండె పోటు రావడంతో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులతో పాటు సినీ ఇండస్ట్రీ మొత్తం షాక్ కు గురైంది. ప్రస్తుతం ఇంకా స్పృహలోకి రాకపోవడంతో తారకరత్న పరిస్థితి విషమం గానే ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -